Saturday, May 4, 2024

ఐఎస్‌ఎస్‌కు వెళ్తూ పగలే కనిపించిన స్పేస్‌ఎక్స్ స్పేస్‌క్రాప్ట్

- Advertisement -
- Advertisement -

 

వాషింగ్టన్ : స్పేస్‌ఎక్స్ ఇటీవలనే ప్రయోగించిన రీసప్లయి స్పేస్‌క్రాప్ట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తూ శనివారం పట్టపగలే కనిపించింది. శనివారం ఉదయం కక్షలో తిరుగుతూ కనిపించిన దృశ్యాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ట్వీట్ చేసింది. స్పేస్ స్టేషన్‌తో అనుసంధానం కావడానికి ముందు కక్షలో తిరుగుతూ కనిపించిందని నాసా పేర్కొంది. ఈనెల 3న ఫ్లోరిడా లోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి మధ్యాహ్నం 1.29 గంటలకు దీన్ని ప్రయోగించారు. 7300 పౌండ్ల బరువు గల సైన్స్ పరికరాలను ఇది మోసుకెళ్లింది. నెల రోజుల పాటు ఇది అక్కడే ఉంటుంది. అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఏడుగురు వ్యోమగాముల కోసం తాజా నిమ్మకాయలు, ఉల్లిపాయలు, అవకాడోలు, చెర్రీ టమోటాలు ఇందులో ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News