Thursday, November 7, 2024

రైతుల ముంగిటకు సహకార బ్యాంకుల సేవలు

- Advertisement -
- Advertisement -

Special app for Cooperative Banking services for Farmers

 

ప్రత్యేక యాప్‌ రూపొందిచాలి
హైలెవల్ కమిటీలో సిఎస్ ఆదేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయ అనుబంధ రంగాల్లో వేగవంతమైన అభివృద్ధిని సాధించేందుకు సహకార బ్యాంకులు తమ సేవలను రైతుముంగిటికే చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం బిఆర్‌కెఆర్ భవన్‌లో సిఎస్ అధ్యక్షత నాబార్డ్ తొలి రాష్ట్రస్ధాయి హైలెవల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని జిల్లా కో ఆపరేటివ క్రెడిట్ (డిసిసిబి)బ్యాంకులు రైతులకు మెరుగైన సేవలందిస్తూనే బ్యాంకుల ఆర్ధిక సామర్ధాన్ని బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం డిసిసిబి అధికారులకు, సభ్యులకు త్వరలోనే వర్క్‌షాప్‌నిర్వహించాలని అదేశించారు. రాష్ట్రంలో కొత్త బ్రాంచిల ఏర్పాటుకు ఉన్న అవకాశాల కోసం అధ్యయనం చేయాలన్నారు. అన్ని గ్రామాల్లో సేవలు అందించేలా లక్ష్యాలు రూపొందిచుకోవాలన్నారు. నూతన లక్ష్యాలతో కూడిన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించి తగిన అనుమతి తీసుకునే అవకాశాలున్నట్టు తెలిపారు. డిసిసిబి శాఖల ద్వారా మరిన్ని సేవలను అందచేసేందుకు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించాలన్నారు.

డిసిసిబిల పటిష్టతకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో సహకార బ్యాంకుల వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు హైలెవల్ కమిటీ సమర్పించిన నివేదికపై సక్షిప్త నివేదిక తయారు చేయాలని సూచించారు. తెలంగాణ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకుల ద్వారా 795 ప్రైమరి అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీలను కంప్యూటీకరించి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలించినందుకు సిఎస్ సోమేశ్ కుమార్ అధికారులను అభినందించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి , టిఎస్ సిఏబి అధ్యక్షులు కె.రవీందర్ రావు, ఎండి మురళీధర్, కమీషనర్ ఎం.వీరబ్రహ్మయ్య, ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్ .నాబార్డ్ సిజిఎం వై.కె రావు, జిఎం జెఎస్ ఉపాధ్యాయ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News