Monday, April 29, 2024

పారిశుధ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్ : జిల్లాలోని గ్రామపంచాయితీలలో పారిశుధ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందీరంలో ఇంచార్జ్ జిల్లా పంచాయతీ ఆధికారి సురేందర్‌తో కలిసి అన్ని మండలాల మండల పరిషత్ అభివృద్ధి మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో గ్రామపంచాయతీలలో చేపడుతున్న పారిశుధ నిర్వహణ కార్యక్రమాలు, హరితహారం, అంటువ్యాధుల నియంత్రణ, జూనియర్ పంచాయితీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున గ్రామపంచాయతీలలో పారిశుధ పనులను ఎలాంటి అలసత్వం లేకుండా సక్రమంగా నిర్వహించాలన్నారు. మురుగుకాలువలలో పూడిక తీయాలని, రోడ్డు, నివాస ప్రాంతాలలో వర్షపునీరు నిల్వ లేకుండా చూడాలని అన్నారు.

జూనియర్ పంచాయితీ కార్యదర్శుల క్రమబద్దీకరణ కోసంప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో చేపట్టిన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ఉప వైద్యాధికారి, డివిజనల్ పంచాయితీ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News