Monday, April 29, 2024

గిరిజనుల సంక్షేమాభివృద్ధి దిశగా ప్రత్యేక కార్యక్రమాలు

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక ప్రత్యేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర బదావత్ సంతోష్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని కాసిపేట మండలంలోని మల్కపల్లి, లంబాడితండా(డి) గ్రామాల్లో నిర్వహించిన వేడుకల సందరగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొని సేవాలాల్ భోగ్ బండార్ పూజా కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం లంబాడి తండా (డి) గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గిరిజన అభివృద్ధి కోసం అన్ని విధాల కృషి చేస్తుందన్నారు. తెలంగాణ ద శాబ్ది ఉత్సవాల్లో ఒకటిగా గిరిజన దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.

రాష్ట్రం ఆవిర్భవించి 9 సంవత్సరాల పాలనలో అనేక కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందని, జిల్లాలోని 30 గిరిజన తండాలో 16 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చేందుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. 6 శాతం ఉన్న గిరిజన రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచడం జరిగిందని, గ్రూపు 1,2,3,4 తో పాటు ఇతర రంగాల్లో ఈ రిజర్వేషన్ అమలు చేయడం జరుగుతుందన్నారు.

గిరిజనుల ఆరాధ్య దైవం, సంత్ సేవాలాల్ మహరాజ్, కొమురంభీం జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బంజారా భవన్, ఆదివాసీ భవన్‌లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పోడు భూములలో సాగు చేసుకుంటున్న గిరిజన రైతులను ఆర్‌ఓఎఫ్‌ఆర్ చట్టం 2005 ప్రకారం పోడు పట్టాల మంజూరులో భాగంగా ఈ నెల 24 నుంచి పంపిణీ ప్రక్రియ ప్రారంభించడం జరుగుతుందన్నారు.

జిల్లాలో 4 వేల 500 ఎకరాలకు సంబంధించి పోడు పట్టాలు పంపిణి చేసేందకు చర్యలు తీసకుంటున్నట్లు తెలిపారు. గిరిజను లు ప్రదర్శించిన బంజారా నృత్య కార్యక్రమాలు అందరిని అలరించాయి. అనంతరం గ్రామ పెద్దలను శాలువాతలో సనామనించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్, మండల పంచాయతీ అధికారి నాగరాజు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News