Monday, April 29, 2024

మావోలపై ప్రత్యేక నిఘా

- Advertisement -
- Advertisement -

Maoists

 

మన తెలంగాణ/హైదరాబాద్ : మావోలపై ప్రత్యేక నిఘా కొనసాగించే విధంగా పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఛత్తీస్‌గఢ్ నుంచి మావోలు రాష్ట్రంలోకి రాకుండా నిరోధించేందుకు అనువుగా మావోలపై ప్రత్యేక నిఘా కొనసాగించే విధంగా చర్యలను పోలీసు శాఖ వేగవంతం చేసింది. మావోయిస్టుల కస్టడీకి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కేంద్ర బలగాలతో కలిసి ఆపరేషన్ ప్రహార్ పేరుతో ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టిన దరిమిలా తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతంలోకి ఛత్తీస్‌గఢ్ వైపు నుంచి మావోలు చొచ్చుకురాకుండా సరిహద్దుల్లో ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో మావోయిస్టు కార్యకలాపాల నిరోధన, అణిచివేతలో అనుభవం వున్న సిబ్బందిని ఆయా ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్లకు ఇప్పటికే బదిలీ చేశారు. అధికారులను సైతం పోలీసు ఉన్నతాధికారులు మార్చబోతున్నారు.

ఈ విధంగా అన్ని స్థాయిల్లో మావోలు సరిహద్దుల్లోంచి రాష్ట్రంలోకి ప్రవేశించని రీతిలో కట్టడి చర్యలకు పోలీసు ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే మణుగూరు సబ్ డివిజన్‌కు తొలిసారి ఐపిఎస్ అధికారిని నియమించారు. సరిహద్దుల్లోని మిగతా సబ్ డివిజన్లలోనూ ఐపీఎస్‌ల నియామకం జరిపి రాష్ట్రంపై ప్రత్యేక నిఘా కొనసాగించే విధంగా పోలీసు శాఖ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కాగా, మావోయిస్టులలో 145 మంది తెలుగువారే ఉన్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నారు. అయితే వీరిలో 15 మంది మాత్రమే తెలంగాణలో క్షేత్రస్థాయిలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 80 మంది మావోలతో తెలంగాణకు చెందిన ఈ 15 మంది కలిసి పనిచేస్తున్నట్లుగా నిఘా వర్గాలు గుర్తించినట్లు తెలుస్తోంది.

వీరంతా అదును దొరికినప్పుడల్లా సరిహద్దులు దాటి రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నట్లు.. పోలీసులు ఒత్తిడి పెరగగానే తిరిగి ఛత్తీస్‌గఢ్‌కు వారు వెళ్లిపోతున్నట్లు నిఘా వర్గాలు తమ అంచనాలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. మావోల కట్టడిలో భాగంగా గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆయా పోలీస్‌స్టేషన్లలో వామపక్ష తీవ్రవాద కార్యకలాపాల్లో అనుభవం ఉన్న సిబ్బందినే నియమించారు. మణుగూరు సబ్ డివిజన్‌కు తొలిసారి ఐపిఎస్ అధికారిని బదిలీ చేశారు. మావోయిస్టులు ఒక్కసారిగా రాష్ట్రంలోకి జొరబడితే వారిని నిరోధించడం కష్టతరమని భావిస్తున్న పోలీసు, నిఘా వర్గాలు అసలు వారు సరిహద్దుల్లోంచి రాష్ట్రంలోకి చొచ్చుకు రాకుండా కట్టడికి పోలీసు శాఖ నడుం బిగించింది. మరోవైపు రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిరంతర కూంబింగ్ చర్యలను విస్తృతం చేసింది. క్షేత్రస్థాయిలో నిఘా వ్యవస్థ పటిష్టతతో అన్ని రకాలుగా మావోల కట్టడికి పోలీసు శాఖ చర్యలు గైకొంటోంది.

Special surveillance on Maoists
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News