Saturday, April 27, 2024

రైతు తన కొడుకుని రైతుని చేయడం లేదు

- Advertisement -
- Advertisement -

Sreekaram release on Mar 11

 

యంగ్ హీరో శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ’శ్రీకారం’. కిశోర్ బి. డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని 14 రీల్స్ పల్స్ బ్యానర్‌పై రామ్ ఆచంట్, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి కానుకగా మార్చి 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అయితే ఈ చిత్రం టీజర్‌ను సూపర్‌స్టార్ మహేష్‌బాబు ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని మహేష్ ఆకాంక్షించారు. ఇక నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక టీజర్‌లో హీరో శర్వానంద్ చెప్పిన డైలాగ్‌లు ఆయన క్యారెక్టరైజేషన్‌ను తెలియజేస్తున్నాయి. “ఒక హీరో తన కొడుకుని హీరో చేస్తున్నాడు. ఒక డాక్టర్ తన కొడుకుని డాక్టర్‌ని చేస్తున్నాడు. ఒక ఇంజనీర్ తన కొడుకుని ఇంజనీర్‌ని చేస్తున్నాడు. కానీ ఒక రైతు మాత్రమే తన కొడుకుని రైతుని చేయడం లేదు. ఈ ఒక్కటీ… నాకు జవాబులేని ప్రశ్నగానే మిగిలిపోయింది”అని టీజర్‌లో శర్వానంద్ చెప్పిన డైలాగ్‌లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News