Tuesday, April 30, 2024

రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు…..

- Advertisement -
- Advertisement -

State wise corona cases in india

ఢిల్లీ: కరోనా వైరస్ ఇండియాలో చాప కింద నీరులా వ్యాపిస్తోంది. మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. ఒక్క ముంబయిలోనే కరోనా కేసుల సంఖ్య దాదాపుగా 37 వేల వరకు ఉన్నాయి. మహారాష్ట్రలో అయితే కరోనా వైరస్ 62 వేల మందికి సోకగా 2100 మంది చనిపోయారు.  భారత దేశంలో ముంబయి, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, పుణే, థానే వంటి నగరాలలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. భారత్ దేశంలో కరోనా వైరస్ 1.73 లక్షల మందికి వ్యాపించగా దాదాపుగా ఐదు వేల మంది మృత్యువాతపడ్డారు. భారత్ లో కరోనా నుంచి 82 వేల మంది కోలుకోగా 86 వేల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య 60.34 లక్షలకు చేరుకోగా 3.67 లక్షల మంది మరణించారు. ప్రపంచంలో కరోనా నుంచి 26.61 లక్షల మంది కోలుకోగా 30 లక్షల మంది చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు:

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు
బాధితుల సంఖ్య చికిత్స పొందుతున్నవారు కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
62,228 33,133 26,997 2,098
తమిళనాడు
20,246 8,776 11,313 157
ఢిల్లీ 17,386 9,142 7,846 398
గుజరాత్ 15,944 6,353 8,611 980
రాజస్థాన్ 8,365 2,937 5,244 184
మధ్య ప్రదేశ్ 7,645 3,042 4,269 334
ఉత్తర ప్రదేశ్
7,445 2,834 4,410 201
రాష్ట్రాలు గుర్తించినవారు
5,043 5,043 0 0
పశ్చిమ బెంగాల్ 4,813 2,736 1,775 302
బిహార్
3,359 2,135 1,209 15
ఆంధ్రప్రదేశ్
3,330 1,036 2,234 60
కర్నాటక 2,781 1,837 894 48
తెలంగాణ 2,425 973 1,381 71
పంజాబ్ 2,197 206 1,949 42
జమ్ము కశ్మీర్ 2,164 1,261 875 28
ఒడిశా
1,723 737 977 9
హర్యానా 1,721 762 940 19
కేరళ
1,151 577 565 9
అస్సాం 1,058 925 126 4
ఉత్తరాఖండ్ 716 607 102 4
ఝార్ఖండ్ 521 300 216 5
ఛత్తీస్ గఢ్ 415 314 100 1
హిమాచల్ ప్రదేశ్ 295 203 83 6
ఛండీగఢ్
289 96 189 4
త్రిపుర
254 87 167 0
లడఖ్ 74 31 43 0
గోవా 69 28 41 0
మణిపూర్ 59 53 6 0
పుదుచ్చేరీ
53 36 17 0
నాగాలాండ్ 36 36 0 0
అండమాన్ నికోబార్ దీవులు 33 0 33 0
మేఘాలయ 27 14 12 1
అరుణాచల్ ప్రదేశ్ 3 2 1 0
దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ
2 1 1 0
మిజోరం 1 0 1 0
సిక్కిం
1 1 0 0
మొత్తం 1,73,872 86,254 82,627 4980

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News