Friday, May 3, 2024

జలాంతర్గాముల సమాచారం లీకేజీపై సిబిఐ మొదటి చార్జ్‌షీట్

- Advertisement -
- Advertisement -

Submarine information CBI first chargesheet on leakage

నిందితుల్లో ఇద్దరు నావీ కమాండర్లు

న్యూఢిల్లీ: జలాంతర్గాముల ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్ చేసిన కేసులో సిబిఐ తన మొదటి చార్జ్‌షీట్‌ను ప్రత్యేక కోర్టుకు మంగళవారం సమర్పించింది. ఈ కేసులో ఇద్దరు నావీ కమాండర్లతోపాటు నలుగురు ఇతర నిందితులపై రౌజ్ అవెన్యూలోని ప్రత్యేక కోర్టులో సిబిఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. నిందితుల్లో నావీ కమాండర్ అజిత్‌కుమార్‌పాండే, రిటైర్డ్ కమాండర్లు రణదీప్‌సింగ్, ఎస్‌జె సింగ్, ఓ ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్ ఉన్నారు. లీకేజీ సమాచారం తెలిసిన తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్‌లో సిబిఐ సోదాలు నిర్వహించింది. ఆ సందర్భంగా ఇద్దరు రిటైర్డ్ అధికారులను అరెస్ట్ చేసింది. అందులో ఒకరి నివాసం నుంచి రూ.2 కోట్లు జప్తు చేసింది. దీనిపై సిబిఐకి చెందిన అవినీతి నిరోధక విభాగం దర్యాప్తు జరుపుతోంది. కీలక సమాచారం లీకేజ్‌కు సంబంధించి ఇద్దరు విదేశీయుల పాత్రపైనా సిబిఐ దృష్టి సారించింది. లీకైన సమాచారం ద్రోహుల చేతికి చిక్కితే ఎదురు కానున్న పరిణామాల విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ నిపుణుల సహాయాన్ని సిబిఐ తీసుకుంటోంది. లీకేజీ వ్యవహారంపై నావీ అంతర్గత దర్యాప్తు కూడా జరుపుతోంది. మరోవైపు సిబిఐ దర్యాప్తునకు తమ పూర్తి సహకారముంటుందని నావీ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News