Monday, April 29, 2024

ఎంత పెద్దయినా అమ్మానాన్నకు పిల్లాడినే!

- Advertisement -
- Advertisement -
sunny deol
నటుడు సన్నీ డియోల్

ముంబయి: సన్నీ డియోల్ ఇటీవల తన తల్లిదండ్రులు ప్రకాశ్ కౌర్, ధర్మేంద్రలతో 9000 అడుగుల ఎత్తులో ఉండే మంచు పర్వతంపై క్యాంపింగ్ చేసి ఆటవిడుపు(హాలీడే) గడిపాడు. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో కూడా పెట్టాడు. అతడు తన తల్లి ప్రకాశ్ కౌర్‌తోనైతే మంచుతో ఆడాడు కూడా. సాధారణంగా అతడి తల్లి ఎక్కువగా బయటికి కనిపించదు. ఇక అతడి తండ్రి, ప్రముఖ నటుడు అయిన ధర్మేంద్ర అయితే అతడిని ‘డార్లింగ్ సన్’ అని ముద్దుగా పిలుచుకున్నాడు. ఇంకా ధరేంద్ర అయితే ‘ఎవరైనా కోరుకునే జీవితం అంటే ఇదే!నేను దేవుడికి, నా అభిమానులకు…వారి దీవెనలకు కృతజ్ఞుడిని’ అన్నారు. సన్నీ డియోల్ తన తండ్రి, తల్లితో మంచు క్యాంప్‌లో గడిపిన హాలీడే వీడియోలను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ కూడా చేశాడు. దీనికి ముందు విమానాశ్రయంలో తల్లి ప్రకాశ్ కౌర్ దుపట్టా(భుజానికి కప్పుకునే వస్త్రం) నేలపై జారిపడితే దాన్ని సన్నీ డియోల్ తీసి ఇచ్చిన దృశ్యాన్ని అతడి అభిమానులు మెచుకున్నారు.

సన్నీ డియోల్ తన ‘ఐ యామ్ సన్నీడియోల్’ ఇన్‌స్టా పోస్ట్‌లో  “ మేము ఎంత పెద్దగా అయినా వారికి ఇంకా పిల్లలమే. తల్లిదండ్రుల ప్రేమ అసలైన, అమూల్యమైన ప్రేమ. నా జ్ఞాపకాలలో ఈ ఘట్టం ఒకటి కాగలదు. ఈ ఘట్టంలో నేను తల్లితో మళ్లీ నా చిన్ననాటి అనుభవాన్ని అనుభవించాను” అని వివరంగా రాశాడు. ఈ హాలీ డేలో తల్లిదండ్రులతోపాటు బాబీ డియోల్ కూడా గడిపాడు.

 

 

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol)

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News