Monday, April 29, 2024

జయప్రదకు జైలు శిక్షపై స్టే…

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: సినీ నటి, మాజీ ఎంపి జయప్రద తన థియేటర్‌లో పని చేస్తున్న కార్మికులకు చందా చెల్లించకపోవడంతో దిగువ కోర్టు విధించిన ఆరు నెలల జైలు శిక్షను సుప్రీం కోర్టు సస్పెండ్ చేసింది. ఇఎస్‌ఐ చందా చెల్లించడంలేదని థియేటర్ కార్మికులు ఎగ్మోర్ సెకెండ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. దీంతో ఆమె ఈ కేసు విషయంలో స్టే విధించాలని హైకోర్టును ఆశ్రయించడంతో నిరాకరించింది. దీంతో ఆమె సుప్రీం కోర్టులో పిల్ వేయడంతో జస్టిస్ అభయ్, జస్టిస్ పంకజ్ మిట్టల్‌తో కూడి ధర్మాసనం కింది కోర్టు ఇచ్చిన శిక్షను సస్పెండ్ చెసినట్లుగా ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్మికులకు నోటీసులు జారీ చేయడంతో పాటు ఫిబ్రవరి 19కి కోర్టు ఈ కేసును వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News