Wednesday, May 1, 2024

కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్..

- Advertisement -
- Advertisement -

అక్కినేని అఖిల్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అఖిల్ కెరీర్‌లో ఐదవ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని ఏకె ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి కలిసి నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత వక్కంతం వంశీ స్టోరీ అందిస్తున్నాడని సమాచారం. ఇకపోతే ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నారని తెలిసింది. సురేందర్ రెడ్డి గత చిత్రాల మాదిరిగా ఫుల్ కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని సమాచారం. ఇందులో అఖిల్ ఓ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ సినిమాలో ముంబయ్ మోడల్ సాక్షి వైద్యని హీరోయిన్‌గా తీసుకున్నారని.. కాదు రష్మిక మందన్న హీరోయిన్ అని రకరకాల వార్తలు వస్తున్నాయి. త్వరలోనే హీరోయిన్ విషయమై ఫిల్మ్‌మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Surender Reddy to direct Action movie with Akhil

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News