Saturday, April 27, 2024

శ్వేత సౌధాధిపతి ఎవరు?

- Advertisement -
- Advertisement -

Suspense over who will be America next upcoming President

 

యావత్ ప్రపంచం కళ్లనీ అమెరికాపైనే
అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు
ఫలితం తారుమారైతే కోర్టును ఆశ్రయించేందుకు లీగల్ ఆర్మీలు సిద్ధం
బైడెన్‌వైపే ప్రీ పోల్ సర్వేల మొగ్గు, మళ్లీ విజయం తనదేనని ట్రంప్ ధీమా

వాషింగ్టన్ : యావత్ ప్రపచం కళ్లన్నీ ఇప్పుడు అమెరికాపై కేంద్రీకృతమయ్యాయి. అగ్రరాజ్యం అమెరికాకు తదుపరి కాబోయే అధ్యక్షుడు ఎవరన్న ఉత్కంఠ అందరి మదిని తొలుస్తోంది. అమెరికా కాలమానం ప్రకారం నవంబర్ 3 ఉదయం 6గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఆయా రాష్ట్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. మాస్కులు ధరించి పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. అమెరికాలో 23కోట్ల మంది ఓటర్లకుగాను ముందస్తు ఓటింగ్ ప్రక్రియలో 10కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నడూ లేనంతగా విభిన్నమైన కఠినమైన ఘట్టంగా చరిత్ర కెక్కిన ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడానికి అమెరికన్లు మంగళవారం భారీ ఎత్తున తరలివచ్చారు. కరోనా మహమ్మారి మళ్లీ ఉధృతంగా విరుచుకుపడుతున్నా లెక్కచేయకుండా తరలివస్తుండడంతో ఈ శతాబ్దం లోనే పెద్ద మలుపుగా ఈ ఎన్నికలు చరిత్ర కెక్కాయి. రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ శ్వేత సౌధాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో తలమునకలై ప్రచారాన్ని హోరెత్తించిన సంగతి తెలిసిందే.

మంగళవారం ఎన్నికలు ముగిసినా మెయిల్‌లో వచ్చిన బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాడానికి కొన్ని రాష్ట్రాల్లో రోజులు, వారాలు కూడా పట్టవచ్చు. అందువల్ల మంగళవారం కొన్ని గంటల్లోనే ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశం లేదు. భారతీయ సంతతికి చెందిన జనాభా నాలుగు మిలియన్ వరకు ఉండగా వీరిలో దాదాపు 2.5 మిలియన్ జనాభా ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్నారు. టెక్సాస్, మిచిగన్, ఫ్లోరిడా, పెన్సిల్వేనియా వంటి కీలకమైన పోటీ ప్రదేశాల్లో భారతీయ అమెరికన్లు దాదాపు 1.3 మిలియన్ మంది వరకు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు భారీ ఎత్తున బారులు తీరి నిల్చుండడం కనిపించింది.

ముఖ్యంగా పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఈ దృశ్యాలు కనిపించాయి. పోలింగ్ ప్రారంభమయ్యే సమయం వేర్వేరు సమయాల జోన్ల కారణంగా రాష్ట్రానికి రాష్ట్రానికి వేరుగా ఉంది. ఈస్ట్‌కోస్ట్‌లో అనేక రాష్ట్రాల్లో పోలింగ్ కేంద్రాలు ఉదయం 6 గంటలకు ప్రారంభం కాగా, వర్జీనియా, న్యూయార్క్, న్యూజెర్సీ, మెయినే, రాష్ట్రాల్లో కాలిఫోర్నియాలోల ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లలో ఈ ఆసక్తి పెద్దమలుపుగా పేర్కొంటూ ఎన్నికల ఫలితాల్లో ఇవి గణనీయమైన మార్పును తీసుకు వస్తాయని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కీలకంగా శ్వేతసౌధం పెన్సిల్వేనియా, విస్కాన్సిన్,జార్జియా,నార్త్ కెరోలినా, ఆరిజోనా ఈ అయిదు రాష్ట్రాల ఫలితాలపై ఆధారపడి ఉందని హిల్ వార్తాపత్రిక కథనం వెల్లడించింది. ఫ్లోరిడాలో దాదాపు 9.1 మిలియన్ మంది ఓటు వేయగా, 2016 ఎన్నికల్లో అక్కడి ఓట్లు మొత్తం 9.6 మిలియన్‌లో ఇప్పుడు 95 శాతం ఓటింగ్ అయినట్టు చెప్పవచ్చు. అమెరికాలో నేషనల్ పాప్యులర్ ఓటుతో విజయం నిర్ణయం కాదు. 538 మంది సభ్యులున్న ఎలెక్టోరల్ కాలేజీలో అభ్యర్థి 270 ఓట్ల ఆధిక్యతను సాధిస్తేనే అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోగలుగుతారు.

దేశం లోని మొత్తం 50 రాష్ట్రాల్లో ఏ రెండు రాష్ట్రాల్లోనైనా ఒక్కో రాష్ట్రం నుంచి అన్ని ఎన్నికల్లో ట్రంప్ కానీ బిడెన్ కానీ పాప్యులర్ ఓటును సాధించుకోవాల్సి ఉంది. జాతీయ స్థాయి పోల్ సర్వేలు మాత్రం ట్రంప్ కన్నా బిడెన్ 8 శాతం ఓట్ల ఆధిక్యతలో ఉన్నారని చెబుతున్నాయి. మరోవైపు ఎన్నికల ఫలితం అటుఇటుగా ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలని ఇటు ట్రంప్, అటు బైడెన్ సిద్ధంగా ఉన్నారు. వందలాది లీగల్ ఆర్మీలను ఏర్పాటు చేసుకొని దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా వెల్లడైన పలు ప్రీ పోల్ సర్వేలు మాత్రం బైడెన్‌వైపే మొగ్గు చూపుతున్నాయి. అలాగని ట్రంప్ ఓటమని అవి ఖరాఖండిగా చెప్పలేకపోయాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News