Wednesday, May 8, 2024

నా జీవిత లక్ష్యం నెరవేరుతోంది: 90 ఏళ్ల వృద్ధ సాధువు

- Advertisement -
- Advertisement -

అయోధ్య: తన జీవిత లక్ష్యం ఎట్టకేలకు నెరవేరుతోందని 90 ఏళ్ల సాధువు యువపురుష పరమానంద గిరి మహరాజ్ అన్నారు. రామాలయ ఉద్యమంలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న గిరి మహరాజ్ అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న వేళ ఎంతో సంతృప్తిగా కనిపించారు. 1969లో శిలా పూజను ప్రత్యక్షంగా తిలకించిన గిరి మహరాజ్ 1992లో బాబీ మసీదు విధ్వంసాన్నీ చూశారు. రామ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును నేరుగా విన్నారు. జనవరి 22న జరగనున్న ఆలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం తన జీవితకాల పోరాటానికి అడ్భుతమైన ముగింపుగా ఆయన అభివర్ణించారు. తన మనోభావాలను మాటలలో వర్ణించలేనని ఆయన అన్నారు. శిలా పూజకు సంబంధించిన సమావేశాలను నిర్వహించడంతో మొదలుపెడితే మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు అన్ని ప్రధాన ఘట్టాలలో

తాను మమేకమై ఉన్నానని ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన గిరి మహరాజ్ తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టులో సభ్యుడు కూడా అయిన గిరి మహరాజ్ తాను 20 ఏళ్ల వయసులో సన్యాసం తీసుకున్నానని, ఇప్పడు తనకు 90 ఏథ్లని చెప్పారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ నాయకత్వం లేకపోతే ఆలయ నిర్మాణంలో ఎన్నో అవాంతరాలు ఏర్పడి ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో వివిధ మఠాధిపతులు ఒకే వేదికపైకి వచ్చేవారు కారని, కాని తామంతా కలసి పనిచేసే పరిస్థితిని శ్రీరాముడే కల్పించాడని ఆయన అన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా హిందువులకు ముఖ్యమైన ఘట్టమని, న్యాయానికి దక్కిన విజయమని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News