Monday, April 29, 2024

బాబ్రీ మసీదును ముస్లింల నుంచి ‘అక్రమంగా’లాగేసుకున్నారు: అసదుద్దీన్ ఒవైసీ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : అఖిల భారత మజ్లిస్ ఎ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠపై తన వైఖరిని శనివారం పునరుద్ఘాటించారు. బాబ్రీ మసీదును ముస్లింల నుంచి ‘అక్రమంగా’ లాగివేసుకున్నారని ఒవైసీ ఆరోపించారు. కర్నాటకలోని కలబురగిలో ఒవైసీ విలేకరులతో మాట్లాడుతూ, 1992లో మసీదును కూల్చివేసి ఉండని పక్షంలో ఈ రోజు పరిస్థితులను ముస్లింలు చూసి ఉండేవారు కాదని అన్నారు.

‘ముస్లింలు 500 ఏళ్ల పాటు బాబ్రీ మసీదులో నమాజ్ చేశారు. కాంగ్రెస్ నేత జిబి పంత్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మసీదు లోపల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో నాయర్ అయోధ్య కలెక్టర్. ఆయన మసీదును మూసివేసి, అక్కడ ప్రార్థనలు ప్రారంభించారు’ అని ఒవైసీ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News