Thursday, May 9, 2024

నజీబుల్లా ఒంటరి పోరాటం.. న్యూజిలాండ్ లక్ష్యం 125

- Advertisement -
- Advertisement -

అబుధాబి: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్ జట్టుకు కివీస్ బౌలర్లు షాకిచ్చారు. నిప్పులు చెరిగే బంతులో ఆఫ్ఘన్ బ్యాట్స్ మెన్లపై విరుచుకుపడ్డారు. దీంతో వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో నజీబుల్లా తనదైన శైలిలో కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఫోర్లు, సిక్స్ లతో మెరుపులు మెరిపించాడు. దీంతో నజీబుల్లా కేవలం 48 బంతుల్లో 73( 6ఫోర్లు, 3సిక్స్ లు) పరుగులతో రాణించాడు. మిగతావారు ఘోర విఫవలమవ్వడంతో ఆఫ్ఘన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులు మాత్రమే సింది. దీంతో కివీస్ జట్టుకు ఆఫ్ఘన్ 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.

T20 World Cup: NZ needs 125 runs to win against AFG

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News