Saturday, April 27, 2024

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తమిళిసైకు అదనపు బాధ్యతలు

- Advertisement -
- Advertisement -

Tamilisai sworn in as Puducherry Lt Governor

గురువారం బాధ్యతలు చేపట్టిన సౌందరరాజన్
ప్రమాణస్వీకారానికి హాజరైన సిఎం, ఇతర మంత్రులు

హైదరాబాద్: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ అధికారికంగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బుధవారం అక్కడి స్పెషల్ రెసిడెంట్ కమిషనర్‌కృష్ణకుమార్ సింగ్ నుంచి వారంట్ ఆఫ్‌అపాయింట్‌మెంట్ నోటిఫికేషన్ అందుకున్న ఆమె గురువారం బాధ్యతలు చేపట్టారు. లెఫ్నినెంట్ గవర్నర్‌గా ఉన్న కిరణ్‌బేడీని తొలగిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 16న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళిసైకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పుదుచ్చేరిలోని రాజ్‌నివాస్‌లో ఎల్జీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సిఎం వి. నారాయణస్వామి, ఇతర మంత్రులు హాజరయ్యారు. కిరణ్‌బేడి 2016 నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా పని చేశారు. పుదుచ్చేరిలో కిరణ్‌బేడి సహా నలుగురు మహిళలు లెఫ్టినెంట్ గవర్నర్లుగా పని చేశారు. తమిళం మాట్లాడే వ్యక్తిని గవర్నర్‌గా నియమించడం ఇదే తొలిసారి.

కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎల్జీకి పేచీలు

ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి తరఫున సిఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూసిన కిరణ్ బేడిని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా 2016లో కేంద్రప్రభుత్వం నియమించింది. అయితే నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎల్జీకి పేచీలు మొదలయ్యాయి. నామినేటెడ్ ఎమ్మెల్యేలుగా ఇద్దరు బిజెపి పార్టీకి చెందిన వ్యక్తులను నియమించడం మొదలుకొని ఎన్నికల కమిషనర్ల నియామకం, ఉచిత బియ్యం, చీరల పంపకాన్ని అడ్డుకోవడం వంటివి వివాదానికి కారణమయ్యాయి. తమ రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాల్లో కిరణ్ బేడి మితీమీరిన జోక్యం చేసుకుంటున్నారని, ఆమెను తొలగించాలంటూ సిఎం స్వయంగా దీక్షకు దిగారు. వారం క్రితం రాష్ట్రపతిని కలిసి ఇదే విషయాన్ని విన్నవించారు. ఈ నేపథ్యంలో ఆమెను ఎల్జీ పదవి నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News