Monday, April 29, 2024

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు వర్షాలు

- Advertisement -
- Advertisement -

tauktae cyclone live tracker

ముంబయి/న్యూఢిల్లీ: తౌక్టే తుఫాన్ ఆదివారం తీవ్రరూపం దాల్చింది. ఉత్తర వాయవ్య దిశగా తుఫాన్ పయనిస్తోంది. మధ్యాహ్నం తర్వాత గోవాకు ఉత్తర వాయవ్యంలో కేంద్రీకృతం కానుంది. దీని ప్రభావంతో రోజంతా ఈదురుగాలులు, వర్షాలు ఉంటాయని ఐఎండి వెల్లడించింది. ఈ నెల 18న మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 గంటల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాన్ ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు పడుతున్నాయి. తౌక్టేతో తీర ప్రాంతం వణుకుతుంది. ఇప్పటికే కేరళ ప్రభుత్వం రెడ్ అలర్డ్ ప్రకటించింది. ఆరు రాష్ట్రాలపై తౌక్టే తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుంది. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. మరో 12గంటల్లో తుఫాన్ తీవ్రరూపం దాల్చనుందని అధికారులు వెల్లడించారు. ఆర్థిక రాజధాని ముంబైకి భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.  తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు వర్షాలు పడనున్నాయి. ఈ తుఫానుకు మయన్మార్ ‘తౌక్టే’ అని పేరు పెట్టింది. గట్టిగా అరిచే జెకో అనే తొండ పేరు ఆధారంగా తుఫాన్ కు ఈ నామకరణం చేసినట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News