Wednesday, May 1, 2024

మాజీ ఎంఎల్ఎ జెసి ప్రభాకర్ రెడ్డి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

TDP Ex MLA JC Prabhakar Reddy Arrested

హైదరాబాద్: తాడిపత్రి టిడిపి మాజీ ఎంఎల్ఎ జేసి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని పోలీసులు అనంతపురానికి తరలించారు. 154 బస్సుల నకిలీ ఎన్ఓసి కేసులో వీరిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. 154 వహనాలకు సంబంధించి అనంతపురం మూలాలతో నేషనల్ వైడ్ స్కామ్ ను బయటపెట్టామని రవాణాశాఖ తెలిపింది. ఈ వాహనాలు ఎపి, నాగాలాండ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నాయని రవాణాశాఖ పేర్కొంది. వీటి రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని రవాణాశాఖ కేంద్రాన్ని కోరింది.

ఇప్పటిదాకా 95వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు అయ్యాయి. ఇంకా 6 వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేయాల్సిఉందని అధికారలు తెలిపారు. మిగిలిన 31 వహనాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించాల్సి ఉన్నట్టు సమాచారం. జేసి నుంచి వాహనాలు కొని మోసపోయామంటూ ఇటీవల ఆయన ఇంటి ముందు యాజమానులు నిరసన తెలిపారు. వారితో సెటిల్ చేసుకునే ప్రయత్నం చేసినా పూర్తిగా సక్సెస్ కాలేదని రవాణాశాఖ తెలిపింది. ఒకే నకిలీ ఇన్సూరెన్స్ పాలసీని నాలుగైదు వాహనాలకు చూపినట్లు రవాణాశాఖ గుర్తించింది. అశోక్ లేలాండ్ నుంచి స్క్రాప్ కొని జఠాధర, గోపాల్ రెడ్డి కంపెనీల పేర్లతో అమ్మినట్లు గుర్తించామని అధికారులు స్పష్టం చేశారు.

TDP Ex MLA JC Prabhakar Reddy Arrested

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News