Saturday, April 27, 2024

ఇంటి నుండే ఖాతా తెరవొచ్చు

- Advertisement -
- Advertisement -

SBI relaunches SBI Insta saving bank account

పాన్, ఆధార్ కార్డు ఉంటేచాలు
ఖాతాలో కనీస బ్యాలెన్స్ అవసరం లేదు : ఎస్‌బిఐ

న్యూఢిల్లీ: ఇంటి నుంచి పొదుపు ఖాతా తెరిచే అవకాశాన్ని ఎస్‌బిఐ కల్పిస్తోంది. ప్రస్తుత కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ‘ఎస్‌బిఐ ఇన్‌స్టా సేవింగ్ బ్యాంక్ అకౌంట్’ను మళ్లీ ప్రారంభించింది. ఇది వినియోగదారుల కోసం ఆధార్ ఆధారిత తక్షణ డిజిటల్ పొదుపు ఖాతా. దీనిని యోనో యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో తెరవవచ్చు. ఈ కొత్త సేవలకు పాన్, ఆధార్ కార్డు నంబర్ ఉంటే చాలు. ఎస్‌బిఐ చైర్మన్ రజనీష్ కుమార్ మాట్లాడుతూ, ఈ ఖాతా అన్నిరకాల లక్షణాలను కలిగి ఉంది. ఇది వినియోగదారులకు బ్యాంక్ శాఖను సందర్శించకుండా సౌకర్యవంతమైన, ఇబ్బందిలేని, కాగి త రహిత బ్యాంకింగ్ అనుభవా న్ని అందిస్తుంది’ అని అన్నారు.

ఈ బ్యాంక్ ఖాతా పేరు ‘ఇన్‌స్టా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్’ అని ఎస్‌బిఐ తన ట్విట్టర్‌లో వెల్లడించింది. ఇంట్లో నుంచే అంటే ఆన్‌లైన్ ద్వారా ఈ ఖాతాను తెరవవచ్చు. ఇందులో కనీస బ్యాలెన్స్ లేకపోయినా బ్యాంక్ ఎలాంటి చార్జీలు వసూలు చేయదు. బ్యాంక్ ప్రస్తుత కస్టమర్లు ఈ ఖాతాలను తెరవలేరు. బ్యాంకు ఖాతా తెరవడానికి ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, పాన్ కార్డ్ కలిగి ఉండటం తప్పనిసరి. బ్యాంక్ ఖాతా తెరిచే సమయంలో నామినీ పేరును నమోదు చేయడం తప్పనిసరి, ఒటిపి (వన్ టైమ్ పాస్వర్డ్) ఆధారిత ఇ-కెవైసి ద్వారా ఖాతా తెరవొచ్చు. ఎస్‌బిఐ వెబ్‌సైట్ యోనో (https://www.sbiyono.sbi/)ని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌బిఐ ఇన్‌స్టా సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులకు 24×7 బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. ఎస్‌బిఐ రుపే ఎటిఎం- కమ్-డెబిట్ కార్డును జారీ చేస్తుంది.

SBI relaunches SBI Insta saving bank account

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News