Thursday, May 9, 2024

ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులపై ఆరా!

- Advertisement -
- Advertisement -
Gathering details of contract and Outsourcing employees

 

అవసరం లేని, పనిచేయని సిబ్బందిపై వేటు
ఉద్యోగుల పొట్టకొడుతున్న ఏజెన్సీలపై వేటు
పొదుపుచర్యలకు ప్రభుత్వం సమాయత్తం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. 15 సంవత్సరాలుగా చాలాచోట్ల ఔట్ సోర్సింగ్ సిబ్బంది అవసరం లేకున్నా కొనసాగిస్తున్నారని ప్రభుత్వానికి అందిన నివేదికలో పలు శాఖల అధికారులు పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇబ్బడిముబ్బడిగా డబ్బులు తీసుకొని ముఖ్యంగా ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని నియమించారని, ప్రస్తుతం వీరి నిర్వహణ ప్రభుత్వానికి అదనపు భారం కావడంతో వారి పనితీరు ఆధారంగా వారిని కొనసాగించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టుగా తెలిసింది. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వలన ఏజెన్సీలు మాత్రమే లాభపడుతున్నాయని ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఏజెన్సీల వివరాలపై ప్రభుత్వం ఆరా తీస్తున్నట్టుగా తెలిసింది.

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది 1.10 లక్షల మంది

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు 2,73,512 మంది ఉండగా, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది 1.10 లక్షల మంది వరకు ఉంటారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పలుశాఖల్లో పలువురు ఉద్యోగులు రిటైర్‌మ్మెంట్ అయిన నేపథ్యంలో వారి స్థానంలో ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో ప్రభుత్వం పనిచేయిస్తూ ఏజెన్సీల ద్వారా వీరికి వేతనాలను చెల్లిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రానికి రాబడులు తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం పొదుపు చర్యలను చేపట్టడానికి సమాయత్తం అవుతోంది. రాష్ట్రంలో నిధు లు, వనరుల లభ్యత ఇంకా కుదుటపడని నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహారిస్తోంది. ఈ క్లిష్ట సమయంలో కఠిన ఆర్థిక క్రమశిక్షణతో నిధుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

సిబ్బంది రెన్యువల్‌పై ఆచితూచి అడుగులు

ఇదే క్రమంలో పలు శాఖల్లో పనిచేసే ఔట్‌సోర్సింగ్, కాం ట్రాక్టు ఉద్యోగులు ఎంతమేర అవసరం, వారి వేతనాలు వంటి వాటిపై అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలు శాఖల్లో ఈ ఏడాది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది రెన్యువల్‌పై ఆచితూచి అడుగువేయాలని ప్రభుత్వం నుంచి ఆయా శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందించినట్టుగా తెలిసింది. ప్రస్తుతం సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో సిబ్బంది అవసరం ఉంటేనే రెన్యువల్ చేయాలని లేని పక్షంలో ఖర్చులు, వేతనాలు తగ్గించుకునేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం.

ఈ నేపథ్యంలో శాఖల వారీగా ఎంతమంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు, వారికి అనుమతించిన జిఒ, వారి హోదా, ఎప్పటివరకు గడువు ఉంది, వారి పనితీరు, ఏ ప్రాతిపదికన వారిని ఎప్పుడు నియమించారు, వంటి పూర్తి వివరాలతో అన్ని శాఖల అధిపతులు అందించిన వివరాల ఆధారంగా అధికారులు నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్టుగా తెలిసింది. ఈ నివేదికలో పూర్తి అంశాల ఆధారంగా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కిన అనంతరం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మేలు చేకూరేలా నిర్ణయం తీసుకోవాలని, దీంతోపాటు ఏజెన్సీల బారి నుంచి వారిని కాపాడాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News