Wednesday, May 1, 2024

2021లో మొత్తం 28 సెలవులు

- Advertisement -
- Advertisement -
Telangana Government holidays 2021
జనవరి 1న సెలవు.. అధికారికంగా ప్రకటించిన సిఎస్

హైదరాబాద్ : వచ్చే సంవత్సరం 2021లోని సెలవులను ప్రభుత్వం మంగళవారం ముందస్తుగా ప్రకటించింది. వచ్చే సంవత్సరం అన్ని ఆదివారాలు, రెండో శనివారాల్లో ( వచే సంవత్సరం ఫిబ్రవరి 13 శనివారం తప్ప) అన్ని ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర చీఫ్ సెక్రటరి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే జనవరి 1వ తేదితో పాటు అదే నెలలో 26న వచ్చే గణతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు స్వాతంత్ర దినోత్సవమైన ఆగస్టు 15తో పాటు పండుగలు, మహానీయుల జయంతి, వర్థంతిలతో కలుపుకుని డిసెంబర్ 26న వచ్చే బాక్సింగ్ డేతో కలుపుకుని ఏడాది మొత్తానికి 28 సెలవులను సిఎస్ అధికారికంగా ప్రకటించారు.

జనవరి 1వ తేదిన సెలవును ప్రకటించినందుకు ఆ తర్వాత ఫిబ్రవరి 13న వచ్చే రెండో శనివారం రోజున వర్కింగ్ డేగా ప్రకటించారు. ఉద్యోగులు సంవత్సరానికి ఐదు వరకు ఆప్షనల్ సెలవులను తీసుకోవచ్చునని తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ఉల్ జుహా, మొహర్రం, ఈద్ ఈ మిలాద్ పర్వదినాలకు సంబంధించిన సెలవులను ఆ పండుగలకు ముందే మీడియా ద్వారా ప్రకటించనున్నట్లు సిఎస్ పేర్కొన్నారు. ఇక అప్షనల్ సెలవులు, విధి నిర్వహణలో మధ్య నుంచి వెళ్లటం వంటి వాటికి సంబంధించి ఉద్యోగులు తమ పై అధికారికి లిఖితఫూర్వకంగా రాసి ఇవ్వాల్సి ఉంటుందని సిఎస్ సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News