Saturday, April 27, 2024

హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం…. సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసే విషయంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన గణేష్ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని హై కోర్టు తీర్పు వెలువడిన నేపధ్యంలో మంగళవారం వారు మాసాబ్ ట్యాంక్ లోని కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు రాఘవరెడ్డి, జనరల్ సెక్రెటరీ భగవంతరావు, వైస్ ప్రెసిడెంట్ కరోడి మాల్, విశ్వహిందు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు, ఉత్సవ సమితి కమిటీ సభ్యులు రామరాజు తదితరులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం హుస్సేన్ సాగర్ లో చేయవద్దంటూ హై కోర్టు తీర్పు వెలువడిన అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష జరిపి తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టు ను ఆశ్రయించడం జరిగిందని వివరించారు.

బుధవారం తీర్పు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని, సానుకూలమైన తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు, శోభాయాత్ర ను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. దేశంలోనే హైదరాబాద్ గణేష్ శోభాయాత్ర కు ప్రత్యేక గుర్తింపు ఉందని, లక్షలాది మంది పాల్గొంటారని వివరించారు. భక్తుల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న విషయాన్ని మంత్రి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News