Friday, May 3, 2024

హోంగార్డు సాహసం ఎంతోగొప్పది (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

Telangana Home guard save dog life

శునకాన్ని కాపాడిన దృశ్యంతో హృదయం చలించిపోతోంది
ట్విట్టర్ వేదికగా మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత

హైదరాబాద్: ప్రజలనే కాదూ ప్రతిప్రాణిని కాపాడేందుకు రక్షకభటులు తమవంతు కృషి చేస్తున్నారు. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతుండటంతో ప్రజలకే కాదు మూగజీవాలు కూడా ప్రమాదాలు పొంచిఉన్నాయి. పొంగుతున్న వాగులు దాటలేక ప్రజలతోపాటు మూగజీవాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈనేపథ్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో ఒకవాగులో కొట్టుకుపోతున్న శునకాన్ని హోంగార్డు కాపాడి పలువురి ప్రశంసలు అందుకున్నారు.

ప్రజలనే కాదు ప్రతిప్రాణిని కాపాడే బాధ్యత మాదేనని హోంగార్డు ఎండి మజీబ్ గుర్తు చేశారు. నీటిలో కొట్టుకుపోతున్న కుక్కను ప్రాణాలకు తెగించి ముజీబ్ ప్రొక్లైనర్ సహాయంతో కాపాడారు. ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో చూసి మాజీ ఎంపి, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హోంగార్డు మజీబ్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఈదృశ్యం చూస్తుంటే హృదయం చలించిపోతుందని కవిత పేర్కొన్నారు. హోంగార్డు ఎండి ముజీబ్‌తో పాటు ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్న పోలీసులందరికీ కవిత శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News