Wednesday, May 1, 2024

అంబులెన్స్ సర్వీసులు మెరుగుపరుస్తున్నాం: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

Harish Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అంబులెన్స్ సర్వీసులను మెరుగుపరుస్తున్నామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి హరీశ్ రావు గురువారం తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సిఎస్‌ఆర్) ఇన్షియేటివ్ కింద హ్యూండయ్ అందించిన అబులెన్సులను ప్రారంచినప్పుడు ఆయన ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. కోఠిలోని డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ ప్రాంగణంలో ఆయన అంబులెన్స్‌లను ఆవిష్కరించారు. హ్యూండాయ్ రూ. 1.41 కోట్ల వ్యయంతో ఈ అంబులెన్స్‌లను అందించింది. “ఈ అంబులెన్స్‌లను టీచింగ్ హాస్పిటల్స్‌కు ఉపయోగిస్తాం. ఎమర్జెన్సీ రెస్పాన్స్ 108 అంబులెన్స్‌లు ఇప్పటికే రాష్ట్రంలో మొత్తంగా 429 ఉన్నాయి. పాత వాహనాల స్థానంలో కొత్తవి తెచ్చి 108 సర్వీసులను మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని హరీశ్ రావు ఈ సందర్భంగా అన్నారు. కొత్త దవాఖానాలను కూడా తెరుస్తామని ఆయన తెలిపారు.

ambulence

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News