Monday, April 29, 2024

దేశంలో సంక్షేమ పాలనకు తెలంగాణే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఎన్నికల పర్యటలో కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం
50 ఏళ్లు పాలించిన తెలంగాణ అభివృద్ది ఎందుకు గుర్తుకు రాలేదు
రాష్ట్రంలో ఎన్ని రాజకీయ జిమ్మిక్కులు చేసిన బిఆర్‌ఎస్ అధికారం చేపడుతుంది
రాహుల్ గాంధీ వ్యాఖ్యల పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

మన తెలంగాణ/ హైదరాబాద్: దేశంలో ఎక్కడ ఎన్నికల జరిగిన ఢిల్లీ నుంచి కాంగ్రెస్ నేతలు గద్దల్లా వచ్చి వాలుతూ ప్రజలను మభ్యపెట్టే పనులకు తెగబడుతున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. గురువారం రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత పర్యటనపై ఆయన మాట్లాడుతూ హస్తిన కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణకు బంధువులు కాదని, ప్రజలను పీడించే రాబంధులు రాహుల్ గాంధీ వచ్చి అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని, రేవంత్ రెడ్డి బ్యాచ్ రాసిచ్చే అబద్ధాలనే చదివిపోతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే రాహుల్ లీడర్ కాదు జస్ట్ రీడర్ ఇక్కడ గెలిస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని రాహుల్ అంటున్నారని అసలు ఏ హోదాతో ఆ మాట చెబుతున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునా ఖర్గే, రాహుల్, ప్రియాంక అంటూ నిలదీశారు.

ములుగు, మంథని కాదు తెలంగాణలో ఏ నియోజకవర్గానికి వెళ్ళినా అభివృద్ధి కండ్లకు కనపడుతుందని, ఏ గడపకు వెళ్ళినా గులాబీ జెండా కనిపిస్తుందని ఏ గుండె చప్పుడు విన్నా జై కెసిఆర్, జై తెలంగాణ అంటుందన్నారు.
పక్క రాష్ట్రామైన కర్ణాటకలో 5 గ్యారెంటీలు అమలు చేశామని రాహుల్ గాంధీ పదే పదే వ్యాఖ్యానిస్తున్నారని ఏమున్నది కర్ణాటకలో రైతులకు ఏడు గంటల కరెంటు ఇస్తమని అధికారంలోకి వచ్చి 5 గంటల కరెంటు కూడా ఇస్తలేరని ఆరోపించారు. అక్కడి రైతులు కరెంటు కోసం కన్నీరు మున్నీరవుతున్న పట్టించుకోకుండా గతం కంటే కరెంటు ఉత్పత్తి పెరిగినా రైతులకు ఇయ్యకుండా కాంగ్రెస్ గోసపుచ్చుకుంటున్నదన్నారు. ఇక్కడ కూడా రైతులకు 3 గంటల కరెంటు చాలు అని రేవంత్ రెడ్డి అనలేదా? దీనిని బట్ట్టి రైతులకు కరెంటు ఇవ్వడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని స్పష్టం అవుతుందని వీళ్లను నమ్ముకుని అధికారం అప్పగిస్తే రైతులను బతుకనిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లా దొంగరాత్రి కరెంటు మొదలైతుందని రైతులు అర్థరాత్రి అపరాత్రి పోలాలకు పోయి పాముకాట్లకు, తేలుకాట్లకు గురై పరిస్ధితి వస్తుందన్నారు. మన రైతులకు ఇదే కావాలా? రైతులే రాజంటున్న కెసిఆర్ పాలన కావాలా? అన్నారు.

సిఎం కెసిఆర్ స్వయంగా రైతు కావడంతో రైతుల కష్టనష్టాలు బాగా తెలుసు అందుకే 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని మోడీ అతి తప్పు అంటున్నాడని మోటార్లకు మీటర్లు పెట్టమంటున్నారు ప్రాణం పోయినా మీటర్లు పెట్టనని సిఎం కెసిఆర్ ఆయన మొఖం చెబితే తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందన్నారు. మనకు రూ.25 వేల కోట్లు రాకుండా ఆపింది. అయినా తగ్గలేదని అదీ రైతులపై ప్రేమ ఉన్న మన సర్కారు దమ్ము. రైతుల కోసం పథకాలు పెట్టినా కేంద్రంతో కొట్లాటకు దిగినా ఒక్క కేసీఆర్‌కే సాధ్యమైందన్నారు. చత్తీస్‌గఢ్‌లో వరి ధాన్యాన్ని ఎంఎస్పీకి కొంటున్నామని రాహుల్ డబ్బా కొట్టుకుంటున్నాడు మరి ఎకరానికి ఎంత కొంటున్నా చెప్పారా కేవలం ఎకరానికి 15 క్వింటాళ్లు మాత్రమేనని మరి ఎకరాకు ఎన్ని క్వింటాళ్లు పండుతాయో రాహుల్ కు తెలుసా మిగతా ధాన్యానికి ఎందుకు ఎంఎస్పీ ఇవ్వట్లేదో కాంగ్రెస్ చెప్పాలన్నారు. రైతులపై నిజంగా ప్రేమ ఉంటే మొత్తం పంటను ఎంఎస్పీకి కొనాలి కదా ఆంక్షలు ఎందుకు ఇది రైతులను దగా చేయడం కాదా రాహుల్ గాంధీ ఇదీ మీరు రైతులకు చేసిన ద్రోహమని పేర్కొన్నారు.

మన రాష్ట్రంలో రైతులు ఎకరానికి 23-25 క్వింటాళ్లు పండిస్తున్నారని సిఎం కెసిఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా ఆంక్షలు ఆంక్షలు పెట్ట్లేదని కల్లాల దగ్గరనే పంట మొత్తం కొంటున్నారు ఆన్‌లైన్‌లో రైతుల ఖాతాల్లో పైసలు వేస్తున్నామని పోన్‌లో సమాచారం రాగానే రైతన్నల మొఖంలో ఆనందం వస్తున్నదన్నారు. మాట మాట్లాడితే మేం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నం, తెలంగాణ ఇచ్చినం అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని 2004లో తెలంగాణ ఇస్తమని సిఎం కెసిఆర్ హామీ ఇచ్చి మాతో పొత్తు పెట్టుకున్నారన్నారు. తమ పార్టీని బలహీనపరిచి తెలంగాణ వాదమే లేదని బుకాయించేందుకు కుట్రలు చేయలేదా కెసిఆర్ కేంద్రప్రభుత్వం నుంచి ఎందుకు రాజీనామా చేయాల్సిన వచ్చింది? కరీంనగర్ ఉపఎన్నికలో తెలంగాణ ప్రజలంతా తెలంగాణ సెంటిమెంట్ ను కాంగ్రెస్‌కు రుచిచూపించలేదా? అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేయలేదని రాహుల్ గాంధీ అంటున్నారు ఒక్కసారి రైతులను అడుగుదామా ఇచ్చిన మాట మేరకు రెండుసార్లు రైతులకు రణమాఫీ చేసిన ఏకైక సర్కారు బిఆర్‌ఎస్‌నే తెలిపారు. రాజస్థాన్ లో ఆరోగ్య పథకం ఎంతమందికి ఇస్తున్నారో చెప్పాలని సిఎం కెసిఆర్ తెలంగాణను హెల్త్ హబ్ గా తీర్చిదిద్దారని, చిన్నపాటి జ్వరాల నుంచి కరోనాలు వచ్చినా కూడా తెలంగాణకు వచ్చి ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నారని చెప్పారు.

అసలు కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఏముంది కనీసం మన బిడ్డలకు మెడికల్ సీట్లు కూడా కేటాయించలేదని, మెడికల్ కాలేజీలు లేవు ఏపీకి మాత్రం కేటాయించారని మండిపడ్డారు. అసలు వైద్యరంగంలో తెలంగాణకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. పోడు, అసైన్డ్ భూముల వ్యవహారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందకు పరిష్కరించలేదన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సమ్మక్క సారక్క జాతరను జాతీయ ఉత్సవంగా ప్రకటిస్తామనడం ఇంతకంటే మోసపు మాటలు ఇంకేముందని సమ్మక్క సారక్క జాతర ఎప్పటి నుండి జరుగుతుందని దేశాన్ని 50 ఏండ్లకు పైగా పాలించిన కాంగ్రెస్‌కు అప్పుడు మన సమ్మక్క సారక్క జాతర కనిపించలేదా ఇప్పుడు జాతీయ పండుగ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా రామప్పకు వెళ్లడం మంచిదే రామప్ప శిల్పాలు, గుడి ప్రపంచ ప్రసిద్ధి దాని బాగోగులు ఈ కాంగ్రెస్ సర్కారు ఎన్నడు పట్టించుకోలేదని, తెలంగాణ వచ్చాక కదా గుడిని సుందరంగా తీర్చిదిద్ది యునెస్కో గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకున్నదన్నారు.

బిజెపికి బిఆరెస్ బి- టీం అని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని కానీ వాస్తవమేంటంటే బిజెపి, కాంగ్రెస్ రెండూ నాణేనికి బొమ్మా బొరుసు లాంటివి.. ఇద్దరూ దొంగలేనని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌లో బిజెపికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని బీఆరెస్ పార్టీ ఎవరికీ బి-టీం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు ఏ- టీం,  మాకు తెలంగాణ ప్రజలే హైకమాండ్. మా ఎజెండా తెలంగాణ అభివృద్ధి మా విధానం సంక్షేమం.. అందుకే దేశంలో సంక్షేమ పాలనకు కేరాఫ్ అంటే తెలంగాణలో కెసిఆర్ సర్కారని దునియా మొత్తం కీర్తిస్తున్నదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News