Sunday, April 28, 2024

శాంతి భద్రతలో తెలంగాణ నెంబర్ వన్

- Advertisement -
- Advertisement -
  • హోం మంత్రి మహమూద్ అలీ
  • పోలీసులు ఫిట్‌నెస్‌గా ఉండే వారికి ప్రమోషన్లు ఇవ్వాలి
  • కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
  • పోచారం ఐటి కారిడార్ పోలీసుస్టేషన్‌ను ప్రారంభించిన మంత్రులు

ఘట్‌కేసర్: తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతలలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని, నేడు రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థతో ప్రజలకు చేరువౌతున్నారని రాష్ట్ర హోం మంత్రి మహ్మద్ ఆలీ అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధి యంనంపేట్‌లోని వార్డు కార్యాలయంలో పోచారం ఐటి కారిడార్ పోలీస్‌స్టేషన్‌ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, డిజిపి అంజన్ కుమార్‌లతో కలసి గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో హోంమంత్రి మాట్లాడుతూ నాడు తెలంగాణ కోసం పోరాడిన సమయంలో ఎంతో మంది తెలంగాణ వస్తే సమస్యలతో ఇబ్బందులు పడతారని, ఆంధ్రాలో కలసి ఉండడమే మంచిదని అన్న వారు నేడు అభివృద్ధ్దిని చూసి ఆశ్చర్యపోతున్నారని, ముఖ్యమంత్రి కేసిఆర్ కృషితో నేడు రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ నీళ్లు, రైతు బంధు, ఇలా ఎన్నో పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. నాడు విద్యుత్ కోసం ఇతర సమస్యల కోసం పోరాడే వారని, కానీ ఎలాంటి సమస్యలు లేకుండా వెనుక బడి ఉన్న తెలంగాణ నేడు దేశానికి మోడల్‌గా నిలిచిందని తెలిపారు.

అంతకుముందు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ పోలీసు వ్యవస్థను పటిష్ట పర్చి దేశానికే ఆదర్శంగా నిలిపారని, రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసిన ప్రజలకు పోలీసులను దగ్గర చేశారని, దీనితో రాష్ట్రంలో కార్పొరేట్ సంస్థలు కంనెనీలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారని గుర్తు చేశారు. కేసిఆర్ లాంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం మనం చేసుకున్న అదృష్టమని, ఇతర రాష్ట్రాలలో పోలీస్‌స్టేషన్లు బూత్ బంగ్లాలుగా ఉంటాయని, కాని మన రాష్ట్రంలో ఐటి భవనాలుగా పోలీస్‌స్టేషన్లు ఉన్నాయని తెలిపారు.

అమెరికా తర్వాత మన రాష్ట్రంలో ఐటి రంగం అభివృద్ధ్ది చెందతుందని, ఐటి శాఖ మంత్రి కేటిఆర్ అమెరికా వెళ్ళి 36 వేల కోట్ల పెట్టుబడులతోపాటు 42 వేల ఉద్యోగావకాలు కల్పించే విధంగా పెట్టుబడులు తీసుకవచ్చారని గుర్తు చేశారు. పోలీసుస్టేషన్లలో జిమ్‌లు ఏర్పాటు చేయాలని, పోలీసులు ఫిట్‌నెస్‌గా ఉండే వారికి ప్రమోషన్లు ఇవ్వాలని, అలా ఉండడంతో దొంగలు, అక్రమార్కులు భయపడే విధంగా చూడాలని హోం మంత్రికి సూచించారు. దేశంలోనే రాచకొండ కమిషనరేట్ అతిపెద్ద కమిషనరేట్ అని, అసెంబ్లీ నియోజకవర్గ్గాలలో మేడ్చల్ దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం అని గుర్తు చేశారు.

పోలీసుస్టేషన్ పరిధిలో ప్రతి కాలనీలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చూడాలని, ఒక్క సిసి కెమెరా వంద మంది కానిస్టేబుళ్లతో సమానమని, అమెరికా తర్వాత మన తెలంగాణలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఉందని, దీని ద్వారా ఎక్కడ ఏ నేరం జరిగినా ఛేదించడానికి పోలీసులకు సులభమౌతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శతర్ చంద్రారెడ్డి, రాచకొండ కమిషనర్ డిఎస్. చౌహన్, డిసిపి గిరిధర్, ఏసిపి నరేష్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, ఘట్‌కేసర్ చైర్ పర్సన్ ముల్లి పావని, వైస్ చైర్మన్ నానావత్ రెడ్యా నాయక్, స్థానిక సిఐ వి. అశోక్ రెడ్డి, ఘట్‌కేసర్ సిఐ మహేందర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ నర్రి ధనలక్ష్మీ, చింతల రాజశేఖర్, బాలగోని వెంకటేష్ గౌడ్, బెజ్జంకి హరిప్రసాద్‌రావు, నాయకులు నర్రి కాశయ్య, బద్ద జగన్ మోహన్ రెడ్డి, నల్లవెల్లి శేఖర్, తదితర నాయకులు పోలీసు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News