Monday, April 29, 2024

తెలంగాణ గ్రామాలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయి: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ గ్రామాలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కెసిఆర్ ప్రోత్సాహంతో గ్రామాలు పల్లె ప్రగతిలో గణనీయమైన వృద్ది సాధిస్తూ, అనేక అవార్డులు పొందుతున్నాయని ప్రశంసించారు. సేంద్రీయ సాగులోనూ తెలంగాణ రైతులు సత్తా చాటుతున్నారని కొనియాడారు. పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం రాగన్న గూడెంలో సేంద్రీయ ఎరువులు తయారు చేస్తూ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారన్నారు.

ఇందులో భాగంగా రాగన్నగూడెంలోని రైతులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సేంద్రీయ ఎరువులు అందించారు. సిఎం కెసిఆర్ మార్గదర్శనంలో తెలంగాణ పల్లెలు పచ్చగా మారాయని, పసిడి పంటలు పండిస్తున్నామని, ఇపుడు ఆరోగ్య తెలంగాణలో భాగంగా సేంద్రీయ వ్యవసాయంలోనూ ముందడుగు వేస్తున్నామన్నారు. సేంద్రీయ ఎరువులు తయారు చేసిన గ్రామస్తులను అభినందించి సేంద్రీయ ఎరువుల పాకెట్ వారి నుంచి ఎర్రబెల్లి కొనుగోలు చేశారు. గ్రామ పంచాయతీలు ఈ విధంగా సంపాదించి స్వయం సమృద్ధితో విలసిల్లాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News