Saturday, April 27, 2024

పోలీస్ శాఖను కలవరపెడుతున్న కరోనా

- Advertisement -
- Advertisement -

 

Telangana police alert with corona
హైదరాబాద్: కరోనా తెలంగాణ పోలీస్ శాఖలో కలవరం సృష్టిస్తోంది. కరోనాతో కొన్ని పోలీస్ స్టేషన్‌లు మూతపడేస్థాయికి చేరుకున్నాయి. పోలీస్ స్టేషన్‌లో ఒక్కరికి కరోనా వచ్చిందంటే చాలు మొత్తం ఉద్యోగులను క్వారంటైన్ చేస్తున్నారు. దీంతో పోలీస్ స్టేషన్‌లను శానిటైజ్ చేస్తున్నారు. డిస్ ఇన్ఫెక్షన్ టీమ్‌లు రంగంలోకి దిగి క్లీన్ చేస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని స్టేషన్లను శుద్ధి చేయనున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఆక్సీమిషన్ పరికరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న కరోనా టెస్టులు చేస్తున్నారు. 50 ఏళ్లకు పైబడి అనారోగ్యంతో ఉన్న వారిని సెలవుపై వెళ్లాలని పైఅధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో రెండు వందల పైగా పోలీసులకు పైగా కరోనా సోకినట్టు సమాచారం. మహారాష్ట్రలో 4 వేల మంది పోలీసులకు పైగా కరోనా బారినపడగా 51 మంది మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 9553 మందికి సోకగా 220 మంది చనిపోయారు. భారత దేశంలో కరోనా కేసుల సంఖ్య 4.57 లక్షలకు చేరుకోగా 14 వేల 500 మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య దాదాపుగా 95 లక్షలకు చేరుకోగా 4.8 లక్షల మంది మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News