Monday, April 29, 2024

Telangana: పంచాయతీ అవార్డుల్లో సత్తా చాటిన తెలంగాణ పల్లెలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్ర జాతీయ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ పల్లెలు సత్తా చాటాయి. సతత్ వికాస్ పురస్కారాల్లో (DDUPSVP) తెలంగాణలో అత్యధిక అవార్డులను దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయితీ గెలుచుకుంది. మొత్తం 27 అవార్డుల్లో 8 అవార్డులు తెలంగాణ గ్రామాలకే దక్కాయి. ఆరోగ్య పంచాయతీ విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌతంపూర్‌, సరిపడా నీరున్న పంచాయతీ విభాగంలో జనగామ జిల్లా నెల్లుట్ల, సామాజిక భద్రత విభాగంలో మహబూబ్‌నగర్ జిల్లా కొంగట్‌పల్లి, మహిళా స్నేహ విభాగంలో సూర్యాపేట జిల్లా అయిపూర్‌ గ్రామలు ప్రథమ స్థానంలో నిలిచాయి.

పేదరికం లేని మెరుగైన జీవనోపాధి పంచాయితీ విభాగంలో జోగులాంబ గద్వాల జిల్లా మండొడ్డి గ్రామ పంచాయతీ రెండో స్థానంలో నిలిచింది. వికారాబాద్ జిల్లా చీమల్దారి గ్రామం పంచాయితీలో సుపరిపాలనలో ద్వితీయ స్థానంలో నిలిచింది. గ్రీన్‌ అండ్‌ క్లీనెస్‌ విభాగంలో పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌పురి మూడో స్థానంలో నిలిచింది. స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు తృతీయ స్థానం లభించింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖకు మంత్రి హరీశ్ రావు అభినందనలు తెలిపారు. గ్రామాభివృద్ధిపై సీఎం కేసీఆర్ దార్శనికతకు ఈ అవార్డులే నిదర్శనమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అధికారులను అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News