Monday, April 29, 2024

కశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు

- Advertisement -
- Advertisement -
Terrorists open fire in Kashmir
ఆస్పత్రిలోకి చొరబడి విధ్వంసానికి యత్నం
భద్రతా దళాలు చుట్టుముట్టడంతో పరారైన ముష్కరులు

శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ ఆస్పత్రిలోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు యత్నించారు. అయితే భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపి ముష్కరులను నియంత్రించడంతో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం మధ్యాహ్నం శ్రీనగర్‌లోని బెమినా ప్రాంతంలో ఉన్న ఎస్‌కెఐఎంఎస్ మెడికల్ కాలేజి ఆస్పత్రిలోకి కొంతమంది ఉగ్రవాదులు ఆయుధాలతో చొరబడి కాల్పులకు తెగబడ్డారు. అయితే సమాచారం అందుకున్న భద్రతా దళాలు అక్కడికి చురుకుని ఆస్పత్రిని చుట్టుముట్టాయి. దీంతో ఉగ్రవాదులు పౌరులను అడ్డుపెట్టుకుని ఆస్పత్రినుంచి పారిపోయారు.ఈ కాల్పుల్లో ఒకరు గాయపడినట్లు తెలుస్తోంది.

అయితే ఉగ్రవాదులు ఇంకా ఆ ప్రాంతంలోనే నక్కి ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు ఆస్పత్రి పరిసరాల్లో కార్డన్ సెర్చ్ మొదలుపెట్టి ఉగ్రవాదులకోసం వేట చేపట్టారు. కాగా.. జమ్మూ, కశ్మీర్‌లో పౌరులపై వరసదాడుల తర్వాత ఉగ్రవాదులు చేపట్టిన తొలి భారీ దాడి ఇదేనని పోలీసులు చెప్తున్నారు. గత నెల కశ్మీర్ లోయలో వలస కూలీలు, మైనారిటీలను ఉగ్రవాదులు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ దాడులను అరికట్టేందుకు శ్రీనగర్‌లో 50 కంపెనీల భద్రతా బలగాలను అదనంగా మోహరించారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ, కశ్మీర్‌లో మూడు రోజుల పాటు పర్యటించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News