Monday, May 6, 2024

దీపావళి తర్వాత ఢిల్లీ ఆస్పత్రులకు పోటెత్తిన కాలిన గాయాల కేసులు

- Advertisement -
- Advertisement -

100 Cracker Burn Cases Reported At Delhi

న్యూఢిల్లీ: దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చడం, దీపాలు వెలిగించడం వల్ల తగిలిన గాయాలతో ఢిల్లీ ఆస్పత్రులకు వందకు పైగా కేసులు వచ్చాయని ఆస్పత్రి వర్గాలు శుక్రవారం తెలిపాయి. దేశంలోనే అతిపెద్ద కాలిన గాయాల విభాగం ఉన్న సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి 50 కేసులు రాగా వారిలో స్వల్ప గాయాలయిన 43 మందికి ఔట్‌పేషెంట్లుగా చికిత్స అందించారని, ఎక్కువ గాయాలయిన మిగతా ఏడుగురిని ఆస్పత్రిలో చేర్చుకున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వీరిలో 36 మందికి టపాకాయలు కాల్చడం వల్ల గాయాలు కాగా, మిగతా 14 మందికి ప్రమిదలు వెలిగించే సమయంలో గాయాలయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కాలిన గాయలతో ఆస్పత్రికి వచ్చిన వారి సంఖ్య రెట్టింపు అయిందని, కొవిడ్ కేసులు తగ్గడంతో జనంలో భయం తగ్గడమే దీనికి కారణం కావచ్చని ఓ డాక్టర్ చెప్పారు. అయితే కొవిడ్‌కు మందు దీపావళిలతో పోలిస్తే కేసులు తక్కువేనని కూడా ఆ వర్గాలు తెలిపాయి. కాగా రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి 23 మంది రోగులు కాలిన గాయాలతో రాగా, వారిలో తీవ్ర గాయాలయిన ఇద్దరిని ఆస్పత్రిలో చేర్చుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా కంటి సంబంధిత సమస్యలతో ఎయిమ్స్‌లోని నేత్ర చికిత్సాఅత్యవసర విభాగానికి 33 మంది రోగులు వచ్చారు. వీరిలో 18 మందిని సర్జరీ, సంబంధిత చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News