Monday, April 29, 2024

క్లైమాక్స్‌కు చేరిన టెస్టు చాంపియన్‌షిప్ సమరం

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రతిష్టాత్మకమైన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా ఈ చాంపియన్‌షిప్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఇక భారత్ చేతిలో ఘోర పరాజయం పాలైన ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు ఫైనల్ చేరే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో విజయం సాధిస్తే టీమిండియాకు ఫైనల్ బెర్త్ ఖాయమవుతోంది. ఇక రెండో బెర్త్ కోసం మాత్రం ఆసక్తికర పోటీ నెలకొంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఎవరో ఒకరికీ ఫైనల్లో ప్రవేశించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో పోల్చితే న్యూజిలాండ్‌కు కాస్త మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్, శ్రీలంకలతో జరిగిన టెస్టు సిరీస్‌లలో విజయం సాధించడంతో కివీస్ అవకాశాలు మెరుగయ్యాయి. ఇటీవల కాలంలో న్యూజిలాండ్ టెస్టుల్లో నిలకడైన విజయాలు సాధిస్తోంది. ఇక భారత్, ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్లను సయితం వెనక్కినెట్టి కివీస్ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం. ఇక టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్ పాయింట్ల విషయంలో ఎవరికీ అందనంత దూరంలో ఉంది. కానీ కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) కొత్త నిబంధనను అమలు చేస్తోంది. ఇది టీమిండియాకు సమస్యగా తయారైంది. అత్యధిక విజయాలు సాధించినా విజయ శాతం విషయంలో భారత జట్టు కాస్త వెనుకబడి ఉంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల నుంచి ఈ అంశంలో టీమిండియాకు గట్టి పోటీ ఎదురవుతోంది. ప్రస్తుతం భారత్ 71.7 గెలుపు శాతంతో టెస్టు చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో ఓటమి పాలైతే మాత్రం భారత్ పరిస్థితి కాస్త ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది. అంతేగాక స్వదేశంలో జరిగే సిరీస్‌లో పరాజయం ఎదురైతే దాని ప్రభావం గెలుపు శాతంపై కచ్చితంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం టీమిండియా జోరును చూస్తే ఇంగ్లండ్‌పై సిరీస్ గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సీనియర్లు లేకుండానే ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై చిత్తుగా ఓడించిన భారత్‌కు స్వదేశంలో ఇంగ్లండ్‌ను ఓడించడం సమస్యేమీ కాదు.

అయితే ప్రతిభావంతులైన క్రికెటర్లతో కూడిన ఇంగ్లీష్ జట్టును ఓడించడం అనుకున్నంత తేలికేంకాదు. గతంలో భారత గడ్డపై ఇంగ్లండ్ ఘన విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి స్థితిలో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్ తర్వాతే భారత్ ఫైనల్ బెర్త్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా ఫైనల్ బెర్త్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. భారత్ చేతిలో ఆస్ట్రేలియా ఓటమి పాలు కావడం కివీస్‌కు కలిసి వచ్చింది. ఒకవేళ సిరీస్ డ్రా అయితే మాత్రం కివీస్‌కు ఇబ్బందిగానే ఉండేది. ప్రస్తుతం కివీస్ 70 గెలుపు శాతంతో రెండో స్థానంలో నిలిచింది. అయితే కివీస్ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఆడే మ్యాచ్‌లు ప్రస్తుతానికి ఏమీ లేవు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉన్నా దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. దీంతో ఫైనల్ బెర్త్ కోసం న్యూజిలాండ్ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది. ఇందులో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా ఆడే టెస్టు మ్యాచ్ ఫలితాలపై కివీస్ ఎదురు చూడక తప్పదు. మరోవైపు మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకు కూడా ఫైనల్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌లో విజయం సాధిస్తే ఆస్ట్రేలియా టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇక సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లకు కూడా ఇంకా ఆశలు మిగిలేవున్నాయి. కానీ తర్వాత జరిగే సిరీస్‌లలో విజయాలు సాధిస్తేనే ఈ ఛాన్స్ ఉంటుంది. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, న్యూజిలాండ్ జట్లకే ఫైనల్ చేరే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.

మరోవైపు, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ పోరును ఐసిసి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా పలు మ్యాచ్ లు రద్దు కావడంతో ముందు ప్రకటించిన షెడ్యూల్‌ ను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో జూన్‌ 18 నుంచి 22 వరకు ఫైనల్ మ్యాచ్ తిష్టాత్మక లార్డ్స్‌ క్రికెట్‌ మైదానంలో జరగనుంది.

Test Championship final Postponed to June 18-22

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News