Monday, April 29, 2024

ఒయు జాబ్‌మేళాకు విశేష స్పందన

- Advertisement -
- Advertisement -

job-mela

హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా యూనివర్శిటీ ఎంప్లామెంట్ ఇన్మర్మేషన్,గైడెన్స్‌బ్యూరో మోడల్ కేరీ, సింక్రోసెర్వ్ గ్లోబుల్ సొలూషన్స్ నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన వచ్చినట్లు ఓయూ డెరెక్టర్ బి. బాలస్వామి తెలిపారు. శనివారం అల్వాల్‌లో జరిగిన మేళాకు 14కంపెనీల ప్రతినిధులు హాజరై 902 ఖాళీ పోస్టులకు ఇంటర్వూలు నిర్వహించగా, 210మందికిపైగా అభ్యర్దులు పాల్గొన్నట్లు చెప్పారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఇలాంటి జాబ్ మేళా అవకాశాలను ఉపయోగించుకుని తమ నైపుణ్యాలను అనువైన ఉద్యోగాను పొంది కేరీర్‌ని అభివృద్ది చేసుకోవాలని ఆకాంక్షించారు.

అదే విధంగా నేషన్ కేరీర్ సర్వీస్ ప్రొఫెసల్ టి.రఘపతి ప్రసంగిస్తూ నిరుద్యోగ యువతకు జాతీయ స్దాయిలో అవకాశాలను వివరిస్తూ ఎన్‌సిఎస్ సర్వీసెసన్ కార్యక్రమాలను ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం సింక్రొసెర్వ్ గ్లోబల్ సొలుషన్స్ సెంటర్ నిర్వహకులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్‌సిఎస్ సహకారంతో ప్రతి నెల ఒక జాబ్ మేళ నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగాలు పొందేందుకు స్కిల్స్ ప్రాముఖ్యత వివరించారు.ఈజాబ్‌మేళాలో సీనియర్ అసిస్టెంట్ ఎం దర్శన్,సత్తయ్య, సైన్క్రోసేర్వ్ సిబ్బందితో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈమేళాల్లో 33మంది అభ్యర్దులు ఎంపికైనట్లు ,వారి నియామక పత్రాలు అందజేసి అభినందించారు.

The remarkable response to OU job mela

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News