Monday, April 29, 2024

ఓటు హక్కు ప్రతి పౌరుని బాధ్యత

- Advertisement -
- Advertisement -

కొండపాక: ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని 18 సంత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కును బాధ్యతగా నమోదు చేసుకోవాలని కొండపాక తహసీల్దార్ చల్లా శ్రీనివాస్ ఓటర్లకు సూచించారు. శనివారం కొండపాక మండల కేంద్రంలో బూత్ స్థాయి ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ ఈ శని, ఆదివారాల్లో ప్రతి గ్రామంలో ప్రత్యేక ఓటర్ నమోదు కేంద్రలను ఏర్పాటు చేసినట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 01 అక్టోబర్ 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి వయోజనులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తెలిపారు అంతేకాక మరణించిన ఓటరు వివరాలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటర్ నమోదు కేంద్రంలో బూతులు ఆఫీసర్స్ వద్ద సంబంధిత పత్రాలలో మరణించినట్లుగా ధ్రువకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ బూత్ లెవల్ ఆఫీసర్స్, తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది సురేష్ పాల్గొన్నారు.

సిద్దిపేట అర్బన్‌లో…

సీఈఓ తెలంగాణ (రాష్ట్ర ఎన్నికల అధికారి) ఆదేశాలమేరకు రెండు రోజులు ప్రతి పోలింగ్ కేంద్రంలో నూతన ఓటర్ నమోదు కొరకు (ఫార్మ్ -6), చనిపోయిన ఓటరును, డబుల్ ఓటును తొలగించేందుకు (ఫార్మ్ – 7) , మార్పులు చేర్పుల కొరకు (ఫార్మ్ -8) ఓటర్లు తమ పోలింగ్ కేంద్రంలో గల బీఎల్‌ఓ (బూత్ లెవల్ ఆఫీసర్) ని సంప్రదించి ఫార్మ్ 6,7,8 లలో ఏదైనా దరఖాస్తును సమర్పించేందుకు స్పెషల్ క్యాంపెయిన్ ఏర్పాటు చేశామని అందులో భాగంగా కమిషనర్ సంపత్‌కుమార్ పరిశీలించి క్యాంపెయిన్‌ని ప్రతి ఒక్క ఓటరు సద్వినియోగ పరుచుకోవాలన్నారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఓటరుగా నమోదు – ఓటరు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News