Monday, April 29, 2024

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అమరుల త్యాగం వెలకట్టలేనిది

- Advertisement -
- Advertisement -
  • మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  • వికారాబాద్‌లో అమరువీరుల స్థూపం ప్రారంభం

వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అమరుల త్యాగం వెలకట్టలేనిదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించి, నివాళులు అర్పించారు. అమరుల కుటుంvసభ్యులతో మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి సహపంక్తి భోజనం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబసభ్యులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా వడ్డించి వారితో కలిసి భోజనం చేసారు.

అనంతరం గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముగింపు రోజున అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. అమరుల త్యాగం వేల కట్టలేనిదని, ముఖ్యమంత్రి కేసీఆర్ నగరం నడిబొడ్డున అతి పెద్ద అమరుల జ్యోతిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటేరియట్‌లో ఎవరు వచ్చిన, పోయిన ఒక వైపు బాబా సాహెబ్ అంబేడ్కర్ అతి పెద్ద విగ్రహం, మరో వైపు ఎప్పటికి ఆరని అమరుల జ్యోతి కనిపించేలా ఏర్పాటు చేసారని తెలిపారు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం అమరుల త్యాగాలను గుర్తు పెట్టుకుంటామని, వారి ఆశయాల సాధన కోసం కృషి చేస్తామన్నారు. దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా బరువెక్కిన హృదయాలతో యావత్ తెలంగాణ సమాజం అమరులకు నివాళులు అర్పిస్తుందన్నారు.

ఉద్యమ నాయకులు కేసీఆర్ పిలుపు మేరకు నాడు ఉవ్వెత్తున జరిగిన తెలంగాణ పోరులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మంత్రి అభినందించారు. ఉద్యమంలో బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల, కుటుంబసభ్యుల బాధ వర్ణణాతీతమని, వారి రుణం తీర్చలేనిదన్నారు. నాడు స్వర్గీయ ఇంద్రన్న జై తెలంగాణ అని తన కారు మీద రాయించుకొని తిరిగారని, అందరిని ఏకతాటిపైకి తేవటానికి కృషి చేసారన్నారు.

రాష్ట్రం సాధించుకున్న తర్వాత మన నీళ్లు, ఉద్యోగాలు, నిధులు మనకే దక్కుతున్నాయన్నారు. నాడు వికారాబాద్‌లో జరిగిన పోరును గుర్తు చేసుకొని, బిసి కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, ఇతర జెఎసి నేతలను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ సునీత మహేందర్‌రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, పట్నం నరేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, కొప్పుల మహేశ్వరరెడ్డి, బిసి కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, అమరవీరుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News