Monday, April 29, 2024

సింగరేణి ఉద్యోగుల సంక్షేమమే సంస్థ లక్షం

- Advertisement -
- Advertisement -

కాసిపేట: సింగరేణి ఉద్యోగుల సంక్షేమమే సంస్థ లక్షం అని మందమర్రి ఏరియా జిఎం జి. మోహాన్‌రెడ్డి అన్నారు. కెకె డిస్పెన్సరీలో కార్మికుల ఆరోగ్య పరీక్షల కోసం రూ. 1.8 లక్షల వ్యయంతో రోబోనిక్ సెమి ఆటో అనలైజర్ వైద్య పరికరాన్ని ఏర్పాటు చేయగా శుక్రవారం జిఎం మోహాన్‌రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్బంగా జిఎం మాట్లాడుచు కెకె డిస్పెన్సరీలో ఏర్పాటు చేసిన వైద్య పరికరం వల్ల ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్, పోస్టు లంచ్ బ్లడ్ షగర్ టెస్టు, రాండమ్ బ్లడ్ షుగర్, రీనల్ ఫంక్షన్ టెస్టు(కిడ్ని ఫంక్షన్‌టెస్టు) తో పాటు లుపిడ్ ప్రోఫైల్(కొలస్ట్రాల్ టెస్టు) తక్కువ సమయంలో పరీక్షలు చేయవచ్చని ఆయన తెలిపారు.

కార్మికుల వైద్య సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని సంస్థ కెకె డిస్పెన్సరీలో ఈ వైద్య పరికరం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఉద్యోగస్తులు సేవలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వోటుజిఎం రాజేశ్వర్‌రెడ్డి, డివైసిఎంవో ఉష, డాక్టర్ నాగేశ్వర్‌రావ్, టిబిజికెఎస్ నాయకులు బేడిపల్లి సంపత్, బడికెల సంపత్, శంకర్, ఎఐటియుసి నాయకులు భీమనాధుని సుదార్శన్ తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News