Monday, April 29, 2024

సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కొత్తపల్లి మండలంలోని చింతకుంట గ్రామంలో 8 కోట్లతో నిర్మిస్తున్న, షాదిఖానా, 13కోట్లతో నిర్మిస్తున్న అంబేద్కర్ భవన్ నిర్మాణ పనులను , నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలసి మంత్రి గంగు ల కమలాకర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ భవన్ నిర్మాణ పనులను ఆగస్టు 15 వరకు పూర్తి చేస్తామని, షాది ఖానా పనులు చురుకుగా కొనసాగుతున్నాయని, పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, జడ్పిటిసి పిట్టల కరుణ రవీందర్ ఎంపీటీసీ తిరుపతి నాయక్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ షామీ, మాజీ కోఆప్షన్ సభ్యుడు జమీలుద్దీన్ ,భారత నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ కార్పొరేటర్లు ఏదుల్ల రాజశేఖర్ , కంసాల శ్రీనివాస్, నక్క క్రిష్ణ సరిళ్ల ప్రసాద్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబర్ మేడి మహేష్, మైనార్టీ నగర శాఖ అధ్యక్షుడు మీర్ శోకత్ అలీ, బాబు జానీ నవాజ్, అస్మాత్, అతీనా,బర్కత్ అలీ,ఫాహద్, అలీ మున్నా ఖాన్, నాయకులు దొడ్డి ప్రశాంత్, గంగాధర చందు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News