Thursday, May 9, 2024

‘తెల్లవారితే గురువారం’ హిట్ కావాలి

- Advertisement -
- Advertisement -

Thellavarithe Guruvaram movie pre release event

శ్రీ సింహా కోడూరి హీరోగా మణికాంత్ జెల్లీ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘తెల్లవారితే గురువారం’. రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతలు. కాల భైరవ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని ఈనెల 27న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ “నాకు 20 ఏళ్ల నుంచి తెలిసిన ఒకే ఒక కుటుంబం కీరవాణి, జక్కన్నల కుటుంబం. నేను తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం వెనక వాళ్లే ఉన్నారు. ఇక మా భైరవ, సింహాలకు ఇంకో మెట్టు ఎక్కేలా ఈ మూవీ దోహదపడాలి. ఈ మూవీ హిట్ కావాలి”అని అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ “సినిమా టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ బాగున్నాయి. భైరవ విషయంలో నాకు ఎలాంటి భయం లేదు. వాడు క్లాస్, మాస్ అయినా ఇరగ్గొట్టేస్తున్నాడు. ఇక మా చిన్నోడు శ్రీ సింహా గురించి ప్రేక్షకులు చెప్పాలి. మొదటి సినిమా అయినా కూడా దర్శకుడు బాగా తీశాడు” అని చెప్పారు. ఈ వేడుకలో కీరవాణి, మణికాంత్, సత్యతో పాటు చిత్ర బృందం పాల్గొంది.

Thellavarithe Guruvaram movie pre release event

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News