Saturday, April 27, 2024

సోషల్ మీడియాలో ఐదు రకాల పోస్టులు చేయాలి

- Advertisement -
- Advertisement -
  • అదనపు డిసిపి మహేందర్

సిద్దిపేట: ప్రతిరోజు ప్రజలకు ఉపయోగపడే విధం గా చేసే పనిని ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పోస్ట్ చేయాలని అదనపు డిసిపి మహేందర్ అన్నారు. సిపి శ్వేత అదేశానుసారం కమిషనర్ కార్యాలయంలో టెక్ టీమ్ సిబ్బంది, ఫేస్‌బక్ , ట్విట్టర్ సోషల్ మీడియాపై ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించారు. మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఐదురకాల పోస్టులు చే యవచ్చని తెలిపారు. సోషల్ నెట్ వర్కింగ్, ఫొటోషేరింగ్, వీడియో షే రింగ్, ఇంట్రాక్టివ్ మీడియా, కమ్యూనిటీ బిల్డింగ్, సోషల్ మీడియాను బా గా ఉపయోగించాలని తెలిపారు. నూతన టెక్నాలజీని అందుపుచ్చుకొని విధి నిర్వహణలో ముందుకు వెళ్లాలని సామాజిక మాధ్యమాల ద్వారా మనం చేసే పనిని ప్రజలకు షేర్ చేయడం ద్వారా పోలీస్ వ్యవస్థ యొక్క ఇమేజ్ పెరుగుందని సూచించారు.

సోషల్ మీడియా ఎక్కువ ఉపయోగించడం వల్ల కమ్యూనికేషన్ సహకారం అభిప్రాయాలు సమీక్షలు మానిటరింగ్ మీడియా భాగస్వామ్యం మరింత పెంపొందిచుకోవచ్చని సామాజిక మధ్యమాల ద్వారా కమ్యూనిటీ పెంచుకోవచ్చని వ్యక్తులతో పరస్పర పరిచయాలు పెంచుకోవచ్చని ప్రెండ్లీ పోలిసింగ్ ద్వారా ప్రజలకు మరింత దగ్గర అయ్యే అవకాశం ఉన్నందున సోషల్ మీడియాను బాగు ఉపయోగించుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాల ద్వారా పోలీసులు ప్రజల గురించి చే సే ప్రతి పనిని నేరుగా ప్రజలకు తెలపడం సాధ్యం కానంపదన సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియపరచడం చాలా ముఖ్యమన్నారు. ఈ వర్క్‌షాపులో ఎసిపి దేవారెడ్డి, ట్రాఫిక్ సిఐ తిరుపతి, టెక్ టీమ్ సిబ్బంది, జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఆశోక్, వేణు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News