Sunday, May 12, 2024

కరోనా ‘ఫ్రీ’ తెలంగాణ

- Advertisement -
- Advertisement -

etela rajender

 

నేడు పుణే నుంచి రానున్న మరో నివేదిక
పాజిటివ్ వచ్చిన వ్యక్తికి కూడా తాజా పరీక్షల్ల్లో నెగిటివ్ : వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల

విదేశీ ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి
మరో నాలుగు థర్మల్ మిషన్లు ఏర్పాటు

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం కరోనా ‘ఫ్రీ’గా మారింది. ఇప్పటి వరకు వరకు వ్యాధి వ్యాప్తి చెందలేదు. గత కొన్ని రోజులుగా గాంధీలో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ వ్యక్తికి కూడా తాజా నివేదికల్లో నెగటివ్ వచ్చిందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. వ్యాధి నయమై అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ లో ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదని, రాబోయే రోజుల్లో కూడా వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. మంగళవారం కోఠి కమాండ్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన డిఎంఇ రమేష్‌రెడ్డి, డిహెచ్ శ్రీనివాసరావులతో కలసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. 14 రోజుల పాటు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందిన కరోనా బాధితుడికి తాజాగా చేసిన టెస్టుల్లో తొలి నివేదిక నెగటివ్ వచ్చిందని, మరో రిపోర్టు బుధవారం వస్తుందని, ఈ టెస్టు కూడా నెగటివ్ వచ్చే అవకాశం ఉందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, మరో నాలుగైదు రోజుల్లో ఆ వ్యక్తిని డిశ్చార్జ్ చేస్తామని మంత్రి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో కరోనా వైరస్ వ్యాపిస్తున్న కారణంగా వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు తిరిగి వస్తున్నారని, కావున అన్ని విమానాశ్రయాల్లో 24 గంటలు పాటు స్క్రీనింగ్ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రతి వ్యక్తి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే, వారి ఇంటి వద్ద నుంచే పూర్తి స్థాయిలో పరిశీలిస్తామని తెలిపారు. ఇప్పటికే అన్ని విమానాశ్రయాల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బందికి నాలుగు రెట్లు పెంచి 200 మందితో 24 గంటల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతానికి విమానాశ్రయంలో 4 థర్మో స్క్రీన్ మిషన్స్ అందుబాటులో ఉన్నాయని, కొత్తగా మరో నాలుగు థర్మల్ మిషన్లు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.

దీనిలో బాగంగా కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌తో మాట్లాడి మరిన్ని సదుపాయాల కోసం తాను విన్నపించానని, త్వరలోనే అన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు మంత్రి ఈటల చెప్పారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఒక్క పాజిటివ్ కేసు లేనప్పటికీ, కేరళలో వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ వలన ఇక్కడ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో అన్ని జిల్లాల వైద్యాధికారులను అప్రమత్తం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అనుమానిత లక్షణాలు సంఖ్య పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అనుమతితో ఉస్మానియా మెడికల్ కాలేజిలో కూడా మరో ల్యాబ్‌ను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అయితే గత పదిహేను రోజులుగా విమానాశ్రయంలో 41,102 మందికి స్క్రీనింగ్ చేశామని, దీనిలో 277 మంది అనుమానితులను గాంధీ ఆసుపత్రికి తరలించి వైరస్ పరీక్షలు నిర్వహిస్తే, వీరందరికి కూడా కరోనా నెగటివ్ వచ్చిందని మంత్రి వెల్లడించారు.

ఇదిలా ఉండగా ఇటీవలే కేరళలో పర్యటించిన రాష్ట్ర వైద్యబృందం తనకు రిపోర్టు ఇచ్చిందని, దాన్ని పూర్తిస్థాయిలో పరిశీంచి నియంత్రణ చర్యలు చేపడతామని మంత్రి అన్నారు. జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేసి, అనుమానిత లక్షణాల వారికి చికిత్సను అందిస్తామని మంత్రి చెప్పారు. సిఎం కార్యాలయం నుంచి గ్రామపంచాయితీ వరకు కరోనా వైరస్‌పై సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కరోనాపై చికిత్సను అందించేందుకు ప్రైవేట్‌తో పాటు, కార్పొరేట్ ఆసుపత్రులు కూడా ముందుకు రావడం సంతోషంగా ఉందని మంత్రి ఈటల ఆనందం వ్యక్తం చేశారు.

There is not a single corona positive case in Telangana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News