Monday, April 29, 2024

చట్టసభల్లో మహిళల కోటా ఎప్పుడు?

- Advertisement -
- Advertisement -

quota of women

 

తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన, అమలు జరుపుతున్న అనేక పథకాలను గుర్తుచేసి, వాటి ఫలాలు అందరూ అందుకునేలా చైతన్యపరచడం అవసరం. తెలంగాణలో బాల బాలికలను విద్యావంతులను చేయడం కోసం బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ గురుకుల పాఠశాలలను విస్తృతంగా ప్రారంభించి విజయవంతంగా అంతర్జాతీయ ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 30 గురుకుల పాఠశాలలు ఉండేవి. ఇప్పుడు 915 గురుకుల పాఠశాలల్లో రెండున్నర లక్షలమంది బాల బాలికలతో అలరారుతున్నాయి. ఇందులో సగం దాకా బాలికల గురుకులాలు ఉండడం, లక్షకు పైగా బాలికలు అత్యంత ప్రమాణాల విద్య అందుకోవడం ఒక గొప్ప పరిణామం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్, బీడీ కార్మికుల పెన్షన్, వికలాంగుల పెన్షన్, కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ వంటి అనేక పథకాల ద్వారా చేయూతనందిస్తున్నది. ఇలా నెలకు 2016 రూపాయల పెన్షన్ పొందుతున్నవారు 41 లక్షలు. ఇందులో మహిళలు 26 లక్షలు. పురుషులు 15 లక్షలు మాత్రమే. మూడింట రెండు వంతులు మహిళలకు ఈ పథకాల ద్వారా ప్రయోజనం, ఆసరా అందుతున్నది. బీడీ కార్మికులు 90 శాతం మహిళలు కావడం, ఒంటరి మహిళలను ఆదుకోవడం వంటి వాటి ద్వారా మహిళలు లబ్ధిదారుల్లో ఎక్కువ కనపడడం జరుగుతున్నది. నాలుగు లక్షలకు పైగా బీడీ కార్మికులు.

సుమారు అంతే సంఖ్యలో ఒంటరి మహిళలు అదనంగా ఉండడం వల్ల లబ్ధి పొందుతున్న మహిళల సంఖ్య ఎక్కువ. పేద మహిళలకు విద్యావంతులైన మహిళలు, సంపన్నులైన మహిళలు తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యం గా ఇంటి పని మనుషులను, వంట పని మనుషులను తమ కుటుంబ సభ్యుల్లా గౌరవించి, సరియైన జీతభత్యాలు, గౌరవాలు, పోషకాహారంతో చేయూతనివ్వడం ఎంతో అవసరం. మహిళా పని మనుషులను చిన్న చూపు చూసే, కులాలను అనుసరించి చిన్నచూపు చూసే మహిళల దృష్టికోణం మార్చడం కూడా ఎంతో అవసరం.

తమ ఇళ్లల్లో పని చేసే, తమ కోసం పని చేసే మహిళల పిల్లల విద్యాబుద్ధుల కోసం చేయూతనందించడం కనీస బాధ్యత. ఎందుకంటే వారి విలువైన పని గంటల్లో సుమారు మూడు నాలుగు పని గంటలు పని మనుషులు పని చేయడం ద్వారా మిగిల్చుకొని ఇతర రంగాల్లో కృషి చేయగలుగుతున్నారు. అంత విలువైన సమయం మిగలడానికి కారకులైన పనివారిని ఆధారంగా, సాదరంగా కుటుంబ సభ్యుల్లా, ఇంటి ఆడపడుచులా గౌరవించడం కూడా మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేసుకోవడం అవసరం. కుల వివక్షను నిర్మూలించాల్సిన అవసరం ఉంది. కులాంతర వివాహాలను మహిళలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

దేశ వ్యాప్తంగా ఆధునిక సమాజ నిర్మాణం కోసం ఎందరో కృషి చేశారు. మహిళలు విద్య, ఉద్యోగ వివిధ రంగాల్లో ఎదిగి రావాలని ఉద్యమాలు చేశారు. వంటింటి కుందేలుగా వంటింటికి పరిమితం కాకూడదని జాతీయ ఉద్యమాల్లో కలిసి రావాలని పిలుపునిచ్చారు. అలా ఎందరో మహిళలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. సమ్మక్క సారక్క, రాణీ రుద్రమదేవి, ఝల్కరీ బాయి, సావిత్రిబాయి ఫూలే, కస్తూరి బా గాంధీ, సరోజినీ నాయుడు, కందుకూరి వీరేశలింగం, జ్యోతిరావు ఫూలే, గాంధీజీ, డా॥ బి.ఆర్. అంబేడ్కర్, నెహ్రూ, ప్రత్యేక ప్రసూతి హాస్పిటల్ ఏర్పాటు చేసిన నీలోఫర్ మొదలుకొని భారత రాజ్యాంగ నిర్మాతలు మహిళల సాధికారికత కోసం సానుకూలంగా వ్యవహరించి రాజ్యాంగంలో పొందుపరిచారు.

మహిళలకు సమాన హక్కుల గురించి అంబేడ్కర్ చేసిన కృషి చరిత్రాత్మకమైనది. మహిళలకు సమాన హక్కులను ప్రతిపాదిస్తూ డా॥ బి.ఆర్. అంబేడ్కర్ న్యాయ శాఖా మంత్రిగా హిందూ కోడ్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే ఆనాటి పరిస్థితుల పరిమితి వల్ల నాటి నాయకుల సంసిద్ధత లోపం వల్ల ఆ బిల్లు పార్లమెంటులో వీగిపోయింది. మహిళల హక్కులు నిరాకరించబడడం అంబేడ్కర్‌ను కలచివేసింది. దాంతో న్యాయ శాఖామంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. మహిళగా ప్రధానమంత్రి హోదాలో ఇందిరాగాంధీ సైతం ఆ హిందూ కోడ్ బిల్లును పునర్నవీకరించి పార్లమెంటులో ఆమోదం కోసం రూపొందించలేకపోయారు. ఎక్కడ స్త్రీలు ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉంటారో అక్కడ స్వర్గం విలసిల్లుతుంది. దేవతలు నడయాడతారు. ప్రతి మహిళా ఒక మాతగా, తల్లిగా ఆరాధించబడే మన దేశంలో ఇంకా పూర్తిస్థాయి హక్కులు, సాధికారికత సాధించాల్సి ఉంది.

వికృత సాంస్కృతిక విలువలు, మీడియా ప్రచారాలు, పెంపకం వంటి వాటి ద్వారా మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. సినిమా, టివి, పత్రికలు, ఫేస్‌బుక్, వాట్సప్ సోషల్ మీడియా ద్వారా సాగుతున్న పురుషాధిపత్య భావజాలం మహిళల అంగాంగ ప్రదర్శన వంటి అనేక అంశాలను నిరోధించడం ఎంతో అవసరం. తమ పిల్లలు అలాంటి సినిమాలు, టివిలు చూడకుండా, అలాంటి ప్రవర్తన అలవర్చుకోకుండా, సత్ ప్రవర్తనకు అనుకూలంగా తీవ్రమైన కృషి చేయాల్సిన అవసరం ఉంది. మహిళలకు పొదుపు తెలుసు. కుటుంబాన్ని పొదుపుగా నిర్వహించడం తెలుసు. పిల్లల పెంపకం తెలుసు. కుటుంబ వ్యవస్థను నిలబెట్టడం తెలుసు. తాను లేకపోతే కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తమవుతుందని, రద్దవుతుందని కూడా మహిళలకు తెలుసు. భారత రాజ్యాంగం పరిధిలో అన్ని రంగాల్లో సాధికారికత కోసం, చట్టసభల్లో ప్రాతినిధ్యం కోసం, అలా ప్రాతినిధ్యం లేని బిసి సామాజిక వర్గాలతో కలిసి మహిళా సంఘాలు, ఉద్యమాలు కలిసి కట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది.

 

When is quota of women in Legislature
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News