Monday, April 29, 2024

మహిళలే లక్ష్యంగా దొంగతనాలు..

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః మయామాటలతో మహిళల దృష్టి మళ్లీంచి వారి వద్ద నుంచి బంగారు నగలను దోచుకుంటున్న ఓ కేటుగాడిని రాంగోపాల్ పేట్ పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం నార్త్‌జోన్ డిసిపి చందనా దీప్తి మీడియాకు వెల్లడించారు. నిందుతుడు ఆంధ్రప్రదేశ్ కావలికి చెందిన వైల వెంకటేశ్వర్లు డాక్టర్‌గా, టిసిగా ఇతర విభాగాల ప్రభుత్వ ఉద్యోగిగా నటిస్తూ ఒంటరి మహిళలే లక్షంగా చేసుకుని వారి దృష్ఠి మళ్లీంచి దొంగతనం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో ఈ నెల 6వ తేదీన నగరానికి చెందిన ఎస్. సుజాత అనే మహిళ తమ బందువుల వివాహానికి పిఠాపురం వెల్లుతున్న క్రమంలో రైలులో నిందుతుడు తనను తాను నిమ్స్ డాక్టర్‌గా పరిచయం చేసుకోవడంతో ఆ మహిళ తన ఆర్యోగ సమస్యలను అతనికి వివరించారని అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫోన్ చేస్తానంటూ మహిళ పోన్ నంబర్ తీసుకున్నారని తెలిపారు.

పెళ్లి పూరైన తర్వాత 7 వ తేదీన తిరుగు ప్రయాణంలో ఉన్న ఆ మహిళకు నిందుతుడు పోన్ చేసి మందులు సిద్దంగా ఉన్నాయని మీరు ఎక్కడ ఉన్నారని అడగడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కలుసుకుందామని చెప్పడంతో అతను అక్కడి చేరుకుని ఆమె గురుద్వార వెనుక రెజిమెంటల్ బజార్‌లోని సాయి వినాయక లాడ్జికి తీసుకు వెళ్లి ఆమెకు సిట్రిజన్ ,హైడ్రోక్లోరైడ్ టాబెట్లను ఇచ్చారన్నారు. దీంతో మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంటనే నిందుతుడు ఆమె వద్ద ఉన్న బంగారు గోసులు, ఉంగారం మొత్తం 5 తులాల బంగారు అభరణాలతో పాటు సెల్ పోన్ ఎత్తుకుని అక్కడి నుంచి పారి పోయ్యాడన్నారు. అపస్మారక స్థితి నుంచి కోలుకున్న ఆ మహిళ తన బ్యాగును తెరిచి ఉండడం చూసి దోపిడికి గురైన గుర్తించి రాంగోపాల్ పేట్ పోలీసులను ఆశ్రయించడంతో ఫిర్యాదు నమోదు చేసుకుని నిందుతుడి కోసం గాలింపు మొదలు పెట్టినట్లు డిసిపి తెలిపారు.

ఇదే క్రమంలో నిందితుడు రైల్వేస్టేషన్‌లో ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు అతని వల పని పట్టుకున్నారని తెలిపారు. విచారణలో నిందుతుడు తానే దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారని వెల్లడించారు. నిందుతుడి నించి 4.9 తులాల బంగారం అభరణాలు, వివో వై 16 మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు డిసిపి వెల్లడించారు. నార్త్‌జోన్ అడిషనల్ డిసిపి సయ్యద్ రఫీక్, పర్యవేక్షణలో గోపాలపురం ఎసిపి ఎన్.సుధీర్, ఇన్స్‌పెక్టర్ కె.మురళీధర్, డిఎస్‌ఐ ఎం. వేణు గోపాల్‌తో పాటు గోపాలపురం సిబ్బంది నిందుడిని అరెస్టు చేసినట్లు డిసిపి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News