Monday, April 29, 2024

చరిత్రలో నిలిచేలా…ధాన్యం కొనుగోలు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : రైతన్న ఆరుగాలం పండించిన పండించిన పంటను మన రాష్ట్రం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జూన్ 10వ తేదీ నాటికి 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి చర్రితలోనే నిలిచి పోయిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆడిబి అథితి గృహంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసి మాట్లాడారు. 2022 జూన్ 10వ తేదీ నాటికి కేవలం 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో 9 లక్షల 50 వేల మంది రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవడం జరిగిందని మంత్రి వివరించారు. రైతుల నుండి ఇప్పటి వరకు 12,450 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. తొలుత తెలంగాణ వ్యాప్తంగా 7,192 ధాన్యం కేంద్రాలను ప్రారంభిస్తామని ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ 7,034 కొనుగోలు కేంద్రాలను మాత్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో 4,135 కేంద్రాలు మాత్రమే ఉండేవని తెలిపారు. ఇప్పటివరకు 6, కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశాం అని పేర్కొన్నారు.

మిగతా డబ్బులను సైతం జూన్ 15లోగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాం అని మంత్రి వెల్లడించారు. దేశంలో రెండవ పంటను కొనుగోలు చేసి ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. జూన్ 16వ తేదీ వరకు కొనుగోలు కేంద్రాలను క్లోస్ చేయడం జరుగుతందని, ఆలస్యంగా ప్రారంభమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అనుమతిని ఇవ్వడం జరుగుతుందని ఆందోళన చెందవద్దని తెలిపారు. సీఎం కేసీఆర్ రైతన్నను అన్ని విధాల ఆదుకుంటు, సరైన సమయానికి పెట్టుబడి సమయం అందించడం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మండుటెండల్లో మత్తడి దూకిన చేరువులతో నిటి విడుదలతో పాటు 24 గంటల కరెంటు అందించడంతో రైతన్నకు అధిక దిగుబడి వచ్చిందన్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు పూర్తయినప్పటికి కొంతమంది రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా మా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.

గొప్ప నగరంగా కరీంనగర్:
స్వయంపాలనలో కరీంనగర్ గొప్ప నగరంగా అవతరించిందని అన్నారు. కరీంనగర్‌లో జరిగిన అభివృద్ధి మీ కళ్ళ ముందే ఉందన్నారు. గణేష్ నగర్ బైపాస్ రోడ్డును గత 50 సంవత్సరాలుగా ఎవరు పట్టించుకోలేదని, ఇప్పుడు ఆ రోడ్ ను సుందరంగా తీర్చిదిద్దాం అని పేర్కొన్నారు. సివిల్ ఇంజనీర్గా ఎమ్మెల్యేగా కరీంనగర్ ప్రజలకు గొప్ప నగరాన్ని అందించాలని కృషి చేస్తున్నాను అని మంత్రి గంగుల తెలిపారు. కరీంనగరం బ్రహ్మోత్సవాలు కలోత్సవాలు చిత్రోత్సవాలకు వేదికగా మారిందన్నారు.

21న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కేబుల్ బ్రిడ్జి ప్రారంభిస్తాం :
కరీంనగర్‌లోని మానేర్ నది పై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని ఈనెల 21వ రాష్ట్ర మున్సిపాల్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిం చుకోవడం జరుగుతుందన్నారు. నిర్మించిన కేబుల్ బ్రిడ్జి సౌత్ ఇండియాలోనే తొలిదని మంత్రి గంగుల తెలిపారు. ఈ కేబుల్ బ్రిడ్జి దుర్గం చెరువు కన్నా అడ్వాన్సుగా ఉంటుందన్నారు. కేబుల్ బ్రిడ్జిలో 10/30 అడుగుల స్క్రీన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని తెలిపారు. అదే రోజు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా సెంట్రల్ లైటింగ్, పాటు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం… ట్రాఫిక్ సిగ్నల్స్.. ఫ్రీ వైఫై ని ప్రారంభించడం జరుగుతుందన్నారు. సాయంత్రం ఏడు గంటలకు లైటింగ్ సిస్టం క్రాకర్షూ లేజర్ షో బహిరంగ సభ నిర్వహిస్తాం మని, సాయంత్రం 6 గంటల నుండి 11 గంటల వరకు బ్రిడ్జి పైకి వాహనాలను అనుమతించడం జరుగుతుందన్నారు.

ఊహకు అందని విధంగా మానేర్ రివర్‌ఫ్రంట్ :
ఊహకు అందని విధంగా కరీంనగర్‌లో మానేర్ రవర్ ఫ్రంట్ ను నిర్మించడం జరుగుతుందన్నారు. ఆగస్టు 15వ తేదీన మొదటి దశ మానేర్ రివర్ ఫ్రంట్‌ను ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు.
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవలు :
ఓటు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి పరిపాలన అందించేందుకు కృషి చేస్తు ముందుకు సాగుతున్నామని తెలి పారు. ఎవరు రాజకీయ విమర్శలు చేసిన పట్టించుకోము…అవి దీవెనార్థులు అనుకుంటాం… అభివృద్దే లక్షంగా ముందుకు సాగుతా మన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News