Monday, April 29, 2024

ఆదివారం రాశి ఫలాలు(21-01-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. ఆకస్మిక ధనలాభం పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తు కొనుగోలు.

వృషభం – ప్రముఖులతో పరిచయాలు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటర్వ్యూలకు హజరవుతారు. పనులు పూర్తి చేస్తారు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

మిథునం – వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. శ్రమాధికం. కీలక నిర్ణయాలలో జీవితభాగస్వామి సలహాలు తీసుకుంటారు. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనలాభం.

కర్కాటకం – ఇంటా బయటా సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా వుండటం అన్ని విధాలా మంచిది. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.

సింహం – ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుడతారు. ఇంటర్వ్యూలకు హజరవుతారు. సన్నిహితుల నుండి సాయం అందుకుంటారు. ధనలాభం.

కన్య – బంధువుల నుండి శుభవార్తలు వింటారు. సంఘంలో గౌరవం పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు.

తుల – ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. నూతన ప్రయత్నాలలో తొందరపాటు వద్దు. ఇంటర్వ్యూలకు హజరవుతారు. సన్నిహితుల నుండి సాయం అందుకుంటారు. ధనలాభం.

వృశ్చికం – ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు వుంటాయి. సంతానం నుండి కీలక సమాచారం అందుతుంది. వస్తు లాభం.

ధనుస్సు – కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనలాభం సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి.

మకరం – ఇంటాబయటా సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. అరుదైన ఆహ్వానాలు.

కుంభం – కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు పొందుతారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతాయి. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు

మీనం – కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ యత్నాలు సానుకూలంగా వుంటాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. విలువైన వస్తు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News