Saturday, April 27, 2024

ముఖాన్ని ముట్టుకుంటే అనారోగ్యమే!

- Advertisement -
- Advertisement -

Touching the face

 

వైరస్‌లకు ముఖం అంటే చాలా ఇష్టం. నిజమే కొంతమందికి ముఖాన్ని మాటిమాటికీ రుద్దుకోవడం అలవాటు. రోజులో చాలాసార్లు చేతులతో ముఖాన్ని తడుముతుంటారు. శుభ్రంగా లేని చేతులతో ఇలా చేయడం అనారోగ్యమని చెబుతున్నారు నిపుణులు. వైరస్‌ల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలో ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

* ముఖాన్ని ముట్టుకోవడం ఆపాలి.
* చేతులతో ముఖాన్ని తుడుచుకోవడం, రుద్దుకోవడం, చేతులు ముఖానికి ఆనించి కూర్చోవడం లాంటి అలవాట్లు మానుకోవాలి.
* ఇలా చేయడం అంటే బ్యాక్టీరియాను ఆహ్వానించినట్లే. ఇప్పుడు ప్రబలుతోన్న కరోనా వైరస్ దృష్టా ఇవన్నీ ఇలాచేయడం మంచిదికాదు.
* సాధారణంగా మన ముఖమంతా చిన్న చిన్న రంధ్రాలతో కూడి ఉంటుంది. అందువల్ల అత్యంత వేగంగా బ్యాక్టీరియా వ్యాప్తిచెందుతుంది.

* ముక్కును రుద్దుకోవడం, కళ్లను నలుపడం, గడ్డాన్ని పట్టుకోవడం, నోటి దగ్గర వేళ్లు పెట్టుకోవడంలాంటివి చాలా మంది తెలియకుండానే చేసే పనులు. ఈ అలవాట్లను అంత త్వరగా మానుకోలేరు. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వీటిని వీడటం చాలా సులువని చెబుతున్నారు వైద్యులు.
* మన చేతులు వైరస్‌కి మెట్లలాంటివి. అవి ఎప్పుడెప్పుడు ముఖాన్ని తాకుదామా అని వేచివుంటాయి. ఒక్కసారి ముట్టుకున్నామో అంతే సంగతులు. వదిలే ప్రసక్తే ఉండదు. అనవసరంగా ఎందుకని ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడం అంటున్నారు నిపుణులు. అలవాట్లను మార్చుకుంటే పోతుందని సూచిస్తున్నారు.
* శరీరంలోకి క్రిములు వెళ్లడం వల్ల ఫ్లూ, శ్వాసకోశ సంబంధమైన జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ.

ముఖాన్ని తరచుగా ముట్టుకునే అలవాటును ఎలా పోగొట్టుకోవాలో కొన్ని చిట్కాలు చెబుతున్నారు నిపుణులు.

* చేతిలో ఒత్తిడిని తగ్గించే బంతిని పెట్టుకోవాలి. ఇందువల్ల ముఖం దగ్గరకు చేయి వెళ్లకుండా ఉంటుంది. కానీ ఈ బాల్‌ను తరచుగా శుభ్రపరచుకోవడం మర్చిపోవద్దు.
* ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో ముఖాన్ని తాకాల్సి వస్తే చేతుల్ని శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.
* గోళ్లను కొరకడం, నోట్లో వేళ్లు, పెన్నులు పెట్టుకోవడంలాంటి అలవాట్లను వదిలించుకోవాలి.
* కంప్యూలర్, ఫోన్‌లాంటివి వాడటం అయిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం అలవాటుగా చేసుకుంటే ఉత్తమం.

Touching the face is unhealthy
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News