Saturday, April 27, 2024

35మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ

- Advertisement -
- Advertisement -

Municipal Commissioners

 

హైదరాబాద్ : 35 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం రోజున హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమంపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. కల్వకుర్తి మున్సిపాలిటీ కమిషనర్‌గా ఎండీ జకీర్ అహ్మద్ -ను నియామకం చేస్తూ అక్కడ ఇన్‌చార్జీ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న బాల చం ద్ర సుజన్ తిరిగి యదావిధిగా ఆమె విధుల్లో నే కొనసాగిస్తున్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ కమిషనర్‌గా ఆకుల వెంకటేశ్‌ను, అక్క డ పనిచేస్తున్న త్రయంబకేశ్వర్‌రావును లక్సెట్టిపేట్ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. లక్సెట్టిపేట్ మున్సిపల్ కమిషనర్‌గా ఇప్పటి వరకు వ్యవహరిస్తున్న రాజలింగును రెవెన్యూ అధికారి(ఆన్ డిప్యూటేషన్)గా కొనసాగించారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ కమిషనర్‌గా గోన అన్వేష్ ను నియామకం చేస్తూ అక్కడి కమిషనర్ జయంత్ కుమార్‌రెడ్డిని జగిత్యాల్ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేశారు.

జగిత్యాల్ మున్సిపల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్న డిప్యూటీ ఇఇ లచ్చిరెడ్డిని ఇంజనీరింగ్ విభాగానికి పరిమితం చేశారు. నిర్మల్ మున్సిపాలిటీ కమిషనర్‌గా నల్లమల్ల బాలకృష్ణను నియమిస్తూ అక్కడ అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్న వెంకటేశ్వర్లును ప్రాజెక్టు డైరెక్టర్ డిఆర్‌డిఓగా కొనసాగిస్తున్నారు. అమీన్‌పూర్ మున్సిపాలిటీ కమిషనర్‌గా కుమారి సుజాత ను నియమిస్తూ అక్కడ పనిచేస్తున్న కమిషనర్ వేమనరెడ్డిని ఆలియా కమిషనర్‌గా బదిలీచేశారు. ఇక్కడ అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఎంపిడిఎ వెంకట్‌రాములును అతని బాధ్యతలకు పరిమితం చేశారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ కమిషనర్‌గా వెంకట మణికరణ్ -ను నియమించారు. లావణ్యను- షాద్‌నగర్ మున్సిపాలిటీ కమిషనర్‌గా బదిలీచేస్తూ అక్కడ కమిషనర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్న శరత్‌చంద్రను సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రశాంతిని ఖాళీగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌లో డిప్యూటీ కమిషనర్‌గా నియమించారు.

తాండూరు మున్సిపల్ కమిషనర్‌గా కె. శ్రీనివాస్‌రెడ్డిని బదిలీ చేస్తూ అక్కడ పనిచేస్తున్న ఎండి సాబేర్ అలీని శంషాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు. నర్సంపేట్ మున్సిపల్ కమిషనర్‌గా విద్యాధర్‌ను నియమిస్తూ అక్కడ అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్న టి. శ్రీనివాస్‌రావును సహాయ సంచాలకులు(వ్యవసాయం విభాగం)గా పరిమితం చేశారు. బి. యాదగిరి పరకాల మున్సిపాలిటీకి, చాడల తిరుపతిని – పెద్దపల్లి మున్సిపాలిటీ కమిషనర్‌గా, మట్ట శ్రీనివాస్ రెడ్డిని- వేములవాడ మున్సిపాలిటీకి, కే. సుజాతను- సత్తుపల్లి మున్సిపాలిటీకి, వీరేందర్‌ను- ఇల్లందు మున్సిపాలిటీకి, గద్దె రాజును- మందమర్రి మున్సిపాలిటీ కమిషనర్‌గా బదిలీ చేశారు. వనపర్తి మున్సిపాలిటీకి మహేశ్వర్ రెడ్డిని, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌గా రజినీకాంత్ రెడ్డిని, సదాశివపేట మున్సిపాలిటీకి స్పందనను, ఇక్కడ పనిచేస్తున్న ఖమీర్ అహ్మద్‌ను ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేశారు.

బట్టు నాగిరెడ్డి – హుజుర్‌నగర్ మున్సిపాలిటీ కమిషనర్‌గా, కామారెడ్డి మున్సిపాలిటీకి గంగాధర్ ను, జంపాలా రజితను- యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి, పల్లా రావును- నందికొండ మున్సిపాలిటీ కమిషనర్‌గా, ప్రభాకర్‌ను చిట్యాల్ మున్సిపాలిటీకి, త్రిల్లేశ్వర్‌ను జిహెచ్‌ఎంసి డిప్యూటీ కమిషనర్‌గా, జిహెచ్‌ఎంసిలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న నళిని పద్మావతిని డిఎంఎలో జాయింట్ డైరెక్టర్‌గా నియమించారు. వేణుగోపాల్ రెడ్డిని డిప్యూటీ డైరెక్టర్(డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్)గా, శ్యామ్‌సుందర్‌ను- ఆమన్‌గల్ మున్సిపల్ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

Transfer of 35 Municipal Commissioners
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News