Home తాజా వార్తలు వరల్డ్‌కప్ ట్రోఫీ ఆవిష్కరణ

వరల్డ్‌కప్ ట్రోఫీ ఆవిష్కరణ

Trophy for Men's T20 World Cup was unveiled

దుబాయి: యుఎఇ, ఒమాన్ వేదికగా త్వరలో జరుగనున్న పురుషుల ట్వంటీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించిన ట్రోఫీని శుక్రవారం ఆవిష్కరించారు. దుబాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి జై షా ట్రోఫీని ఆవిష్కరించారు. అక్టోబర్ 17 నుంచి ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం కానుంది. నిజానికి భారత్‌లోనే ఈ టోర్నీ జరగాల్సి ఉంది. అయితే దేశంలో కరోనా పరిస్థితులు పూర్తిగా తగ్గక పోవడంతో ప్రపంచకప్‌ను యుఎఇకి తరలించారు. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లను ఒమాన్‌లో నిర్వహించనున్నారు. మిగిలిన మ్యాచ్‌లకు యుఎఇఆతిథ్యం ఇవ్వనుంది. ఇక ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐసిసి ప్రతినిధులతో పాటు యుఎఇ, ఒమాన్ క్రికెట్ బోర్డులకు చెందిన అధికారులు పాల్గొన్నారు.