Monday, May 6, 2024

పట్టభద్రుల ప్రచారానికి జోరు పెంచిన టిఆర్ఎస్

- Advertisement -
- Advertisement -

పట్టభద్రుల ప్రచారానికి ఓయూ విద్యార్థ్ది నేతలు
అభ్యర్థ్దులను గెలిపించేందుకు నియోజకవర్గాలవారీగా బాధ్యతలు
టిఆర్‌ఎస్వీ తరుపున దూదిమెట్ల, గెల్లు శ్రీనివాస్, పల్లా ప్రవీణ్‌రెడ్డి
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థ్దులకు కౌశిక్ చరణ్, దయాకర్, విజయ్‌కుమార్‌లు ప్రచారం
గ్రాడ్యుయేట్లను ఆకట్టుకునేందుకు తమ ప్రయత్నాలు చేస్తున్న విద్యార్థి నాయకులు

TRS Party ready for MLC Elections

మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలో పట్టభద్రుల ఎన్నికల పోరు ఊ పందుకుంది. ఈనెల 16 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో వివిధ పార్టీలకు చెందిన నాయకులతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసి ప్రచారంలో దూసుకపోతున్నారు. ఎమ్మెల్సీ పోరు ఎక్కువగా అధికార టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీల మధ్య సాగుతుంది. ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసేందుకు అభ్యర్థులు కొత్తకొత్త రాజకీయ వ్యూహాలు రచిస్తూ ప్రచారంలో పరుగులు పెడుతున్నారు. ఓటర్లంతా డిగ్రీ పూర్తి చేసి వారు కావడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన విద్యార్థి నేతలను ప్రచారంలోకి దించి ఓటర్లను ఆకట్టుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు వేగం చేశారు. రెండు గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా పార్టీల పెద్దలు గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విద్యార్థి నాయకులకు ప్రచారం బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. వీరికి అన్ని జిల్లాలకు చెందిన గ్రాడ్యుయేట్లతో సంబంధం ఉండటంతో గెలుపులో కీలకంగా మారారు. రెండు రోజుల కితం ఓయూలో టిఆర్‌ఎస్వీ విద్యార్థి సంఘం, ఎన్‌ఎస్‌యుఐ, ఎబివిపి, వామపక్ష అనుబంధ విద్యార్ది సంఘాలు సమావేశమై అభ్యర్ధులను గెలిపించేందుకు సిద్ధమైన్నట్లు పేర్కొంటున్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్లు స్థానం నుంచి టిఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి రాములునాయక్, బిజెపి తరుపున గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తలపడుతున్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్దానానికి టిఆర్‌ఎస్ నుంచి మాజీ ప్రధాని పివి కూతురు సురభి వాణిదేవి, కాంగ్రెస్ తరుపు చిన్నారెడ్డి, కమలం పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పోటీ పడుతున్నారు. వీరి గెలుపును ఛాలెంజ్ తీసుకుని విద్యార్థి నాయకులు ప్రచారం ఉధృతం చేసేందుకు నడుం బిగించారు. టిఆర్‌ఎస్ అభ్యర్థుల విజయం కోసం ఓయూ విద్యార్థి ఉద్యమనేత దూదిమెట్ల బాలరాజుయాదవ్, టిఆర్‌ఎస్వీ విద్యార్థి సంఘం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్, బొల్లు నాగరాజు, పల్లా ప్రవీణ్‌రెడ్డి నియోజకవర్గాల వారీగా ఓటర్లతో సమావేశం నిర్వహిస్తూ మరోసారి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి పట్టం క ట్టాలని కోరుతున్నారు. సిఎం కెసిఆర్‌తో బంగారు తెలంగాణ సాధ్యమని, త్వరలో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ రానున్నట్లు పట్టభద్రులకు వివరిస్తున్నారు. అదే విధంగా కాంగ్రెస్ అభ్యర్థులను విద్యార్థి నాయకులైన మానవతారాయ్, కౌశిక్‌చరణ్‌యాదవ్, కురవ విజయ్‌కుమార్, చనగాని దయాకర్‌గౌడ్ ప్రచార బాధ్యతలు తీసుకుని పోరులో నిలబడ్డ నేతల గెలుపు కో సం తమవంతు కృషి చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.మార్చి 14 ఎన్నికలు ఉండటంతో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచార పోరులో వి మర్శలు చేసుకుంటూ, తమనే గెలిపించాలని ఓటర్లను కోరుతూ, పలు అ భివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని హామీలు కురిపిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో కాకతీయ, మహాత్మాగాంధీ, పాలమూరు యూనివర్శిటీల్లో విద్యార్థ్దులతో సమావేశం నిర్వహించి, మండలాల వారీగా ప్రచారం బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News