Friday, April 26, 2024

కొనేదాకా కొట్లాటే

- Advertisement -
- Advertisement -

Coca-Cola to invest Rs 1000 crore investment in Telangana

యాసంగి ధాన్య సేకరణపై ధర్నాలతో దద్దరిల్లిన జిల్లా కేంద్రాలు

కేంద్రంపై ఇక యుద్ధమే
రైతుల కోసం చేసేది ధర్మ పోరాటం 
ధాన్యాన్ని బేషరతుగా కొనాల్సిందే
నాడు తెలంగాణ కోసం.. నేడు తెలంగాణ రైతుల కోసం పోరాటం
రైతుల హక్కు సాధించేంత వరకూ కేంద్రంపై పోరాటం ఆగదు 
కేంద్రాన్ని తూర్పార మంత్రులు

మన తెలంగాణ/న్యూస్ నెట్‌వర్క్: యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం మొండివైఖరికి నిరసనగా టిఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో పెద్దఎత్తున ఆందోళనలు, ధర్నాలతో హోరెత్తించాయి. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపుమేరకు రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు, జడ్పి, డిసిసిబి, డిసిఎంఎస్, మునిసిపల్, రైతుబంధు సమితి చైర్‌పర్సన్లు, ప్రజాప్రతినిధులు, రైతులు భారీసంఖ్యలో పాల్గొని నిరసనలు తెలిపారు. కేంద్రం దిగొచ్చి రైతులు పండించిన ధాన్యం చివరిగింజ వరకూ కొనుగోలు చేసేవరకూ ఉద్యమాన్ని ఆపేదిలేదని నేతలు పేర్కొన్నారు. జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లు, ధర్నాచౌక్, మున్సిపల్ కార్యాలయాలు, మెయిన్ సెంటర్లలో ఆం దోళనలు చేశారు. సిరిసిల్లలో మంత్రి కెటిఆర్, సిద్దిపేటలో హరీశ్‌రావు, సంగారెడ్డి వనపర్తి మహబూబ్‌నగర్ నిజామాబాద్‌లో ప్రశాంత్ బైడ్డి, నల్లగొండ, సూర్యాపేటలో మహ్మద్ అలీ, జగదీశ్ రెడ్డి, కరీంనగర్ ఖమ్మం అజయ్, వరంగల్ యాకర్ రావు, మహబూబాబాద్ రాథోడ్, వికారాబాద్ మేడ్చల్ ని ర్మల్‌లో ఇంద్రకరణ్ రెడ్డిలు పాల్గొని కేంద్ర త్వ తీరును ఎండగట్టారు. సిద్దిపేటలో ఆర్‌డిఒ కా ర్యాలయం ఎదుట జరిగిన ఆందోళనలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మాట్లాడుతూ మోడీ అంటే మోదుడు.. బిజెపి అంటే బాదుడు అని విమర్శించారు. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వేలాది మందితో జరిగిన నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఆందోళనలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్, ఎమ్మెల్సీలు ఫారుఖ్ హుస్సెన్, యాదవరెడ్డి, జడ్పి చైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డిలో పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ నమ్మించి మోసం చేసేటోడే నరేంద్రమోడీ అని విమర్శించారు. కలెక్టరేట్ ఎదుట టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కార్యక్రమంలో ఎంఎల్‌ఎలు మహిపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్, మాణిక్‌రావు, మెడికల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ ఎర్రోల్ల శ్రీనివాస్, జడ్పి చైర్‌పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, బేవరేజీస్ మాజీ చైర్మెన్ దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. యాసంగిలో వడ్లు కొనబోమని, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచిస్తే.. బిజెపి నాయకులు రెచ్చగొట్టి వరి వేసేలా చేశారని మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ విమర్శించారు. ఇప్పుడు వరి కొనుగోలు చేసేదిలేదని చెబుతున్నారన్నారు. నిరసనలో ఎంఎల్‌ఎలు చెన్నమనేని రమేష్‌బాబు, నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జిల్లా టిఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.

కేంద్రం ప్రభుత్వ పాలన అల్లకల్లోలంగా తయారయిందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మోడీ నాయకత్వంలో దేశం దశాబ్దాల వెనక్కి నెట్టివేయబడిందని విమర్శించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షల్లో వారు పాల్గొన్నారు. ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, జడ్పి చైర్‌పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్‌రావు, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, గాదరి కిషోర్‌కుమార్, బొల్లం మల్లయ్య, రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, భాస్కరరావు, చిరుమర్తి లింగయ్య, నోముల భరత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరిని కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందేనని వ్యవవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వనపర్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నాలో మంత్రి పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్ ధర్నాలో పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్రం తీరును తప్పుపట్టారు. రాష్ట్రంలో రైతులకు న్యాయం జరిగే వరకు రైతు పోరు ఆపేదిలేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో మహా ధర్నాలో ఆమె పాల్గొన్నారు. జిల్లా టిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, జడ్పి చైర్‌పర్సన్ సునీత రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పట్నం నరేందర్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ వివేకానంద విగ్రహం వద్ద టిఆర్‌ఎస్ శ్రేణులు చేపట్టిన ధర్నాలో కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ నవీన్‌రావు, ఎమ్మెల్యే శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నారెడ్డి నందారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతన్న పండించిన వరి ధాన్యం కొనేంతవరకు కేంద్రంతో కొట్లాటేనని బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట పార్టీ శ్రేణులు ధర్నాలో పాల్గొన్నారు. టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు, సుడా చైర్మన్ జివి రామకృష్ణా రావు, ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, మేయర్ సునీల్ రావు, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగిత్యాలలో జాతీయ రహదారిపై మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సంజయ్‌కుమార్ ధర్నా చేశారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేసేంతవరకు పోరాటాన్ని ఆపకుండా ఉద్యమిద్దామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో సత్యవతి రాథోడ్, ఎంపి కవిత తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎంఎల్‌సిలు బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎంఎల్‌ఎలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. రైతుల పక్షాన పోరాడుతామని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయం వద్ద దీక్షలో మంత్రి పాల్గొన్నారు. మంచిర్యాలలో ధర్నాలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే దివాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. కేంద్రం వైఖరి వల్లే తెలంగాణ రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆర్‌అండ్‌బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

TRS Protest Against Centre Over Paddy Procurement

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News