Monday, April 29, 2024

‘నాడు టిఆర్‌ఎస్‌కు… నేడు బిఆర్‌ఎస్‌కు’ ఊపిరి పోసిన ‘ఉప ఎన్నిక’

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్ : మునుగోడులో టిఆర్‌ఎస్ గెలుపు…బిఆర్‌ఎస్‌కు మలుపు కాబోతున్నది. ఈ విజయంతో సిఎం కెసిఆర్ ఇక జాతీయ స్థాయి రాజకీయాల్లో విప్లవ శంఖం పూరించేందు కు గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు అయింది. మునుగో డు ప్రజలు ఇచ్చిన ఊపు..ఉత్సాహంతో ఇక కేం దంలోని మోడీ సర్కార్ భరతం పట్టేందుకు సిఎం కెసిఆర్ త్వరలోనే హస్తిన బాట పట్టనున్నారు. అక్కడి నుంచే అసలు, సిసలైన జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. బిజెపి సర్కార్‌కు అసలైన సినిమాను చూపించేందుకు రంగం సిద్దం చేసుకునేందుకు ఈ ఉపఎన్నిక విజయాన్ని టిఆర్‌ఎస్ శ్రేణులు సైతం నాందిగా భావిస్తున్నాయి. ఈ విజయం ప్రస్తుతం టిఆర్‌ఎస్‌లో సరికొత్త ఉత్సాహా న్ని ఇస్తుండగా…కెసిఆర్‌ను కట్టడి చేయాలని భా వించిన బిజెపి భంగపాటుకు గురై విలవిలలాడుతోంది. వాస్తవానికి తెలంగాణ స్వీయ రాజకీయ ప్రస్థానంలో ఉపఎన్నికది ఒక విప్లవాత్మక పాత్ర. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన అనే ధర్మయుద్ధం కోసం కెసిఆర్ బయలుదేరితే సిద్ధిపేట ఉప ఎన్నిక అర్ధం చేసుకుని ఆశీర్వదించింది.

ప్రస్తుతం మునుగోడు ప్రజల రణగోడు కేంద్ర పాలకులపై ప్రజాస్వామిక విప్లవశంఖాన్ని పూరించేందుకు సిద్ధమ వుతోందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఓటు ను ఆయుధంగా మార్చి ప్రజా తీర్పుకు నిదర్శనమైతున్నది. తెలంగాణలో నిరుపమాన ప్రక్రియగా కొ నసాగుతున్న ఉప ఎన్నికల పరంపర ఓటును తూ టాలా సానబట్టి గురిచూసి పేల్చుతోంది. నాడు ప్రజాస్వామికంగా తెలంగాణను పట్టి తెచ్చిన ఉప ఎన్నిక నేడు ప్రజాస్వామిక భారతాన్ని బతికించుకునేందుకు మలుపయ్యిందని రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తోంది. దేశంలో ప్రజాస్వామ్యం మీదనే ఆశలు సన్నగిల్లుతూ… అంతిమ దశకు చేరుకున్న ఆరు దశాబ్దాల భారత పార్లమెంటరీ ఎన్నికల ప్రక్రియకు మునుగోడు ఉపఎన్నిక జీవంపోసి నిలబెట్టిందన్న ప్రచారం సాగుతోంది. ఇది బిఆర్‌ఎస్ అనే ఒక విప్లవాత్మక రాజకీయ ప్రత్యామ్న్యాయానికి పురుడు పోసినట్లు అయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News